శ్రీ హనుమాన్ చాలిసా
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
బుద్దిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు |

1. జయహనుమంత జ్ఞానగుణవందిత జయపండిత త్రిలోకపూజిత |
2. రామదూత అతులితబలధామ అంజనీపుత్ర పవనసుతనామ |
3. ఉదయభానుని మధురఫలమని భావనలీలా అమృతమునుబ్రోలిన |
4. కాంచనవర్ణ విరాజితవేష కుండలామండిత కుంచితకేశ |

5. రామసుగ్రీవుల మైత్రినిగొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి |
6. జానకీపతి ముద్రికదోడ్కొని జలధిలంకించి లంకజేరుకొని |
7. సూక్ష్మరూపమున సీతను జూచి వికటరూపమున లంకనుగాల్చి |
8. భీమరూపమున అసురులజంపిన రామకార్యమును సఫలముజేసిన |

9. సీతజాడగని వచ్చిననినుగని శ్రీరఘువీరుడు కౌగిటనినుగొని |
10. సహస్రరీతుల నినుగొనియాడగ కాగలకార్యము నీపైనిడగ |
11. వానరసేనతో వారిధిదాటి లంకేశునితో తలపడిపోరి |
12. హోరుహోరున పోరుసాగిన అసురసేనల వరుసనగోల్చిన |

13. లక్ష్మణమూర్ఛతో రాముడడలగ సంజీవిదెచ్చిన ప్రాణప్రదాత |
14. రామలక్ష్మణుల అస్థ్రదాటికి అసురవీరులు అస్తమించిరి |
15. తిరుగులేని శ్రీరామబాణము జరిపించెను రావణసంహారము |
16. ఎదిరిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణుజేసిన |

17. సీతారాములు నగవులగనిరి ముల్లోకాల హారతులందిరి |
18. అంతులేని ఆనందాశ్రువులె అయోధ్యాపురి పొంగిపొరలె |
19. సీతారాముల సుందరమందిరం శ్రీకాంతుపదం నీహృదయం |
20. రామచరిత కర్ణామృతగాన రామనామ రసామృతాపానా |

21. దుర్గమమగు ఏ కార్యమైన సుగమమేయగు నీకృపజాలిన |
22. కలుగుసుఖములు నినుశరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న |
23. రామద్వారపు కాపరివైన నీ కట్టడిమీర బ్రహ్మదుల తరమా |
24. భూతపిశాచశాఖినీ ఢాఖినీ భయపడి పాదు నీ నామజపమువిని |

25. ధ్వజావిరాజా వజ్రశరీరా ఋజబలతేజా గదాధరా |
26. ఈశ్వరాంశ సంభూతపవిత్ర కేసరీపుత్ర పావనగాత్ర |
27. సనకాదులు బ్రహ్మాదిదేవతలు శారద నారద ఆదిశేషులు |
28. యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీకిర్తి గానముల |

29. సోదరభరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా |
30. సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురులపాలిట కాలుడవన్నా |
31. అష్టసిద్ది నవనిధులకు దాతగ జానకీమాత దీవించెనుగ |
32. రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసిన |

33. నీనామభజన శ్రీరామ రంజన జన్మజన్మాంతర దుఃఖభంజన |
34. ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు |
35. ఇతరచింతనలు మనసున మోతలు స్ధిరముగ మారుతిసేవలు సుఖములు |
36. ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన |

37. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగుసుమా |
38. భక్తి మీరగ గానము సేయగ ముక్తికలగు గౌరీశులు సాక్షిగ |
39. తులసీదాస హనుమాను చాలీసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ |
40. పలికిన సీతా రాముని పలుకున దోషములున్న మన్నింపుమన్నా |

మంగళహరతి గొనుహనుమంతా సీతారామలక్ష్మణ సమేత |
నాఅంతరాత్మ నిలువుఅనంత| నీవే అంతా శ్రీ హనుమంతా |
ఓం శాంతిః శాంతిః శాంతిః