ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRI SURYANARAYANA SWAMY TEMPLE AT JAINADH VILLAGE, NEAR CHANDRAPUR, ADILABAD, TELANGANA, INDIA


శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం

తెలంగాణలో ఎంతో చార్రితక ప్రాధాన్యం గల ‘ఆదిత్యుని ఆలయం’ ఒకటి ఆదిలాబాద్ దగ్గర ఉందన్న సంగతి చాలామందికి తెలియదు.

అది జైనద్ మండల కేంద్రం. ఆదిలాబాద్ పట్టణం నుండి తూర్పువైపున చంద్రాపూర్ మార్గంలో సుమారు 20 కి.మీ. దూరంలో ఈ చిన్న పట్టణం ఉంటది. పూర్వకాలంలో అయితే, ఈ ఊరును ‘ఝేంఝ’ అని పిలిచేవారని, తర్వాత కాలక్షికమేణా అది ‘జైనద్’గా మారిందని చరివూతకారుల కథనం.

ఆదిలాబాద్ జిల్లాలోనే దీనిని ‘అతి ప్రాచీనమైన దేవాలయం’గా చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణ శైలి అంతా మహారాష్ట్ర, త్రయంబకంలలోని దేవాలయాల రీతిని పోలి ఉంటది. అంతేకాదు, ఈ రకమైన అన్ని ఆలయాలకు ఉపయోగించిన ‘శిలా స్వరూపం’ ఒక్కటే కావడం గమనార్హం.

ఇక్కడి మూల విరాట్టును ‘లక్ష్మినారాయణస్వామి’గా పిలవడం మరో విశేషం. అయితే, స్వామి విగ్రహం తల వెనుక భాగంలో నమ్మశక్యం కాని రీతిలో ‘జ్వాలా తోరణం’ ఉంది. ఈ కారణంగానే ఆయన్ని ‘సూర్యనారాయణస్వామి’గా కూడా భక్తులు పిలుస్తారు. దీనికి మరో కారణం ఏమంటే, మందిరంలో ఒకటిన్నర అడుగుల వైశాల్యంలో ఓ శిలా శాసనం ఉంది. దానిపై దేవనాగరి లిపిలో ఇరవై శ్లోకాలు ఉన్నట్టు చెబుతారు. ఈ శాసనం ‘నమః సూర్యాయ’ అంటూ ప్రారంభమైంది. ఈ రీత్యాకూడా ఇక్కడి స్వామి ‘సూర్యనారాయణుడు’ అయ్యాడు.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమూ ఉంది. అదేమంటే ఏడాదిలో నాలుగు నెలలపాటు సూర్యకిరణాలు స్వామి పాదాలను స్పృశిస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మళ్లీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యుడు తూర్పు మధ్యలో ఉదయించిన కాలంలో ప్రప్రథమ లేలేత కిరణాలు ఈ స్వామి పాదాలను స్పర్శించడం విశేషం.

ఎంతో అరుదైన ఈ దేవాలయం రాష్ట్ర కూటులు లేదా కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మితమై ఉండవచ్చునని చరివూతకారులు భావిస్తున్నారు. కాగా, ఈ గ్రామంలో నూతన గృహాల నిర్మాణానికి గాను పలువురు పునాదుల కోసం తవ్వకాలు జరిపినప్పుడు పలు శిల్పాలు బయట పడుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే, పురాతత్వ శాఖ వారు కూడా రెండుమార్లు ఈ దేవాలయం వద్ద తవ్వకాలు జరిపారు.

ప్రస్తుతం ప్రధాన దేవాలయం పక్కన శిథిలమైన మరో శివాలయమూ ఉంది. దీని ముందున్న పుష్కరిణి కూడా బాగా శిథిలమై ఉంది. ప్రస్తుతం అదొక చెరువులా కనిపిస్తోంది. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా ఓ పట్టణంగా ఉండి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే, ఆహ్లాదకరంగా గ్రామం పక్కన ఉన్న ఏరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకప్పుడు వారం వారం సంత జరిగేది. ఇక్కడ పశువుల సంత కూడా ఉండేది. అప్పట్లో చుట్టూ ఉన్న పది, ఇరవై గ్రామాల ప్రజలు ఈ సంతలలో పాల్గొనే వారు. ఇక్కడ పశువుల అమ్మకాలు జోరుగా జరిగేవనీ చెప్తారు. అయితే, ఇప్పుడు ఈ సంతకు ఎవరూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

1985 వరకూ ఇక్కడికి రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలంలో పట్టణంతో సంబంధం తెగిపోయేది. గ్రామంలోని రోగులనైతే మంచంపై పడుకోబెట్టి ఆదిలాబాద్ తీసుకెళ్లే వారు. ఇప్పుడు చంద్రాపూర్ వరకూ పక్కా రోడ్డయ్యింది. గుడి దాకా రవాణా సౌకర్యం కొంతవరకు మెరుగైంది. ప్రస్తుతం జైదన్ గ్రామంలో ఆరోగ్య కేంద్రమూ ఉంది. దానికి స్వంత భవనం ఏర్పాటైంది. ఉన్నత పాఠశాల, పోలీస్ స్టేషన్ వంటివీ ఉన్నాయి. ఆదిలాబాద్ తాలూకా పరిధిలో జూనియర్ కళాశాల ఉన్న మండలం కేంద్రం ఇదే. కాకపోతే మెరుగైన మంచినీటి సౌకర్యం లేదు. వేసవి కాలంలో ఇక్కడనీటికి కటకటే.

జైదన్‌లోని శ్రీ సూర్యనారాయణ స్వామిపట్ల అనేకమంది భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తారు. సంతానం లేని వారు స్వామి వారిని ‘కొంగు బంగారం’గానూ భావిస్తారు. స్వామి వారి దర్శనానికి నాందేడ్, యవత్‌మాన్, చంద్రాపూర్ (మహారాష్ట్ర) జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో (శుద్ధ ద్వాదశి నుండి బహుళ దశమి దాకా) స్వామి వారి కళ్యాణోత్సవం, రథోత్సవం, జాతరలు వైభవంగా జరుగుతాయి.