టొమాటో రసం , తేనె సమపాళ్లల్లో రంగరించి జిగురుగా ఉండే ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి . పది నిమిషాల తర్వాత కడుక్కోండి . వారానికి రెండుసార్లు ఇలా చేస్తే ముఖం కొత్త కళ సంతరించుకుంటుంది.
కొంచెం ముల్తానీ మట్టి , టొమాటో గుజ్జు , పెరుగు , దోసకాయ రసం సమపాళ్లలో కలిపి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత కడుక్కోండి . వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ముఖం కొత్త కళ సంతరించుకుంటుంది.
ముఖచర్మం జిడ్డుగా ఉంటే టొమాటో గుజ్జును రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడుక్కోండి . ఇక , చర్మం పొడిగా ఉండేవారు టొమాటో గుజ్జుకు పెరుగు కలిపి రాసుకుంటే సరిపోతుంది.
సూర్య కాంతికి చర్మం కమిలినప్పుడు టొమాటో , దోస రసాల సమపాళ్లలో కలిపి రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది . చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ముఖం మీద మచ్చలు ఉంటే టొమాటో ముక్కతో పదిహేను నిముషాలు మృదువుగా రుద్దండి.ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి. రోజు ఇలా చేస్తే త్వరలోనే ఫలితం కనిపిస్తుంది.
…….. టొమాటో గుజ్జు రాసుకున్నప్పుడు ముఖం కొద్దిగా చిమచిమలాడినట్టు ఉంటుంది. అది సహజమే. కానీ,కందరికీ భరించలేనంత మంటగా అనిపిస్తుంది. అలాంటి ఇబ్బంది వస్తే వెంటనే చల్లటి నీళ్లతో కడిగేసుకుని ముఖానికి పెరుగు రాసుకోండి.