ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ACCORDING TO INDIAN HINDU VASTHU SASTRA DONOT PERMIT TO SIT GUESTS AND FRIENDS NEAR WINDOWS AND DOORS - HINDU VASTU TIPS IN TELUGU


అతిథులను కిటికీలు, తలుపుల దగ్గర కూర్చోనివ్వకూడదట!

భారతీయ వాస్తు శాస్త్రం కూడా గృహాలలో హాలును ఆకర్షణనీయమైన ప్రదేశంగా పేర్కొంటారు. మన భారతీయ సంస్కృతి ప్రకారం అతిథులకు సంస్కారం, గౌరవమివ్వడం అనే సంస్కృతి ఆనాటి నుంచి ఈనాటి వరకూ పాటిస్తున్నారు. కుటుంబ సభ్యులకే కాక అతిథిలకూ, బంధువులకూ హాలు ప్రవేశ ద్వారం. ఇంటిని చక్కబెట్టే తీరుని బట్టి ఇల్లాలి గుణం అర్థమవుతుందని పూర్వీకుల నమ్మకం కూడా.

మన గృహంలోని హాలును ఏ విధంగా ఉంచుకోవాలనే వాస్తు నియమాలను ఒకసారి పరిశీలిస్తే, హాలును "చి" ప్రవాహానికి అనుకూలంగా నిర్మిస్తే కుటుంబసభ్యులు ఆరోగ్యంగా, మానసిక ఉల్లాసంతో జీవిస్తారు. గృహంలోకి అడుగు పెట్టడం ఇంటి హాలులోనే ఉండాలి. మరో ప్రాంతం నుంచి హాలులోకి చేరుకోవడం వంటివి ఉండకూడదు.

హాలులోకి గాలి వెలుతురు బాగా సోకే విధంగా ఉండాలి. అలా లేని పక్షంలో వెలుతురుకై విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లను అమర్చటం చేయాలి. హాలు చతురస్త్ర, దీర్ఘ చతురస్త్ర ఆకారంలో మాత్రమే ఉండాలి. అలాకాక 'ఎల్' ఆకారాలతో ఉంటే దానికి తగిన ఫర్నిచర్, పూలతొట్టిలతో అలంకరణ చేసుకోవటం ఉత్తమం.

హాలులో సీలింగ్‌కు ఉండే బీమ్‌ల కింద సోఫాలు, కుర్చీలు ఉంచరాదు. హాలుకు వినియోగించే పెయింట్లు నీలిరంగు, పచ్చరంగులతో కూడి ఉండాలి. ఉద్వేగం, ఉద్రేకం తేచ్చే చిత్రాలు హాలులో ఉండకూడదు. ఆగ్నేయమూలలో చేపలతొట్టే ఉంచితే సంపాదన లభించే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఈ మూలను సంపదలను అందించే మూలగా వాస్తు నిపుణులు అంటున్నారు.

అంతేగాక 'చి' ప్రవాహం ఈ మూలద్వారా జరిగితే సంపాదన మాత్రమే గాక ఆ కుటుంబ సభ్యుల సుఖసంతోషాలతో వెల్లివిరియటం ఖాయం. మీ ఇంటికొచ్చిన అతిథులకు మీరు ఆహ్వానమిచ్చే సమయంలో వారి దృష్టి మీపై పడే విధంగా అభిముఖంగా సంభాషణ సాగాలి. 'చి' ప్రవాహానికి అడ్డంగా ఫర్నిచర్‌ను అమర్చకూడదు.

ముఖ్యంగా అతిథులను కిటికీలు, తలుపుల దగ్గర కూర్చోకుండా చూడాలి. ఇంకా చెప్పాలంటే హాలు కాంతివంతంగా ప్రతి సమయం ప్రకాశిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.