ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT SRI MOOLASTANESWARA SWAMI TEMPLE - NADENDLA VILLAGE


 శ్రీ మూల స్థానేశ్వర స్వామి వారి దేవస్థానం

నాదెండ్ల గ్రామంలో ప్రసిద్ధ దేవాలయాలలో శ్రీ గంగ పార్వతి సమేత మూల స్థానేశ్వర స్వామి వారి దేవాలయం ఒకటి. దీనిని మార్కండేయ మహర్షి స్థల పురాణం. కాకతీయ చక్రవర్తి , గణపతి దేవుని గురువు విశ్వేశ్వర శివ దేవుడు ఈ ఆలయంలోనే గోళఖి మఠాన్ని స్థాపించి నిర్వహించారని, ఆయన దర్శనార్ధం గణపతి దేవుడు ఈ ఆలయాన్ని దర్శించాడని పురావస్తు శాఖ వారు తెలిపారు.స్థానికంగా ఈ ఆలయంలో జరిగే క
ార్తీక పౌర్ణమి పండుగ ఎంతో ప్రసిద్ధి. గ్రామానికి చెందిన నల్లమోతు సీతమ్మ భర్త పొలంలో చనిపోయి యుండగా ఆయనను శివాలయములోకి తీసుకోని వచ్చి, ఆయన బ్రతికితే అఖండము పెట్టించి జ్వాల తోరణము (చిచ్చుల తోరణము) ఏర్పాటు చేయిస్తానని సీతమ్మ గారు స్వామి వారికి మొక్కినది. తెల్లవారే సరికి ఆయనలో కదలిక వచ్చినది. ఆయన బ్రతికినందుకు గుర్తుగా ఆనాటినుండి, కార్తీక పౌర్ణమి నాడు, అఖండ దీపం వెలిగించి, చిచ్చుల తోరణం ఏర్పాటు చేస్తారు. దీని కొరకు సీతమ్మ తోపు పేరుతొ, పదకొండు ఎకరాల మాన్యము ఏర్పాటు చేయించినది.

నేడు ఎంతోమంది గ్రామస్తులు స్వామివారిని నమ్ముకొని ప్రతి సోమవారము మరియు ఆయా విశిష్ట దినములలో స్వామివారికి అభిషేకములు, పూజలు జరిపించుచున్నారు. ఈ ఆలయములో అఖండ దీపారాధన ఉన్నది. ఈ ఆలయము ముస్లిము రాజుల దురాగతానికి గురి అయినట్లు ఆలయములో శాసనముల వలన తెలియు చున్నది.ఈ ఆలయములో ప్రతి రోజు బిందె తీర్థము, మేళ తాళాలతో అర్చకులు తీసుకోని వస్తారు
.