నీరసాన్ని తగ్గించే ద్రాక్ష
ద్రాక్షపండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మానవ శరీరానికి అవసరమయ్యే కొన్ని పోషక విలువలు ఇందులో పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదులో చెక్కర వుంటుంది. అందుకే నీరసంగా ఉన్నపుడు ద్రాక్ష రసం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే కార్పోహైడ్రేట్, సిట్రిక్ ఆసిడ్, ప్రోటీనులు, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు లభ్యమవుతాయి. ఈ పండ్లనుగానీ, ఈ పండ్లతో తయారుచేసే రసాన్ని గానీ తరుచుగా తీసుకుంటే.. ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు.
ద్రాక్ష రసంలో కొద్దిగా పంచదార కలిపి పరిగడుపున 48 రోజులపాటు తాగితే.. అల్సర్, పొట్ట రుగ్మతలు దూరమవుతాయి. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తితే.. రోజూ ద్రాక్షరసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. రోజూ ఈ పండ్లరసాన్ని తాగితే.. ఎముకలు, దంతాలు బలపడుతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా వుంటుంది.