ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTHY LIVER WITH NIMBOO JUICE - DRINK NIMBO JUICE AND TAKE PROTECTION OF LIVER


కాలేయానికి టానిక్‌గా పనిచేసే నిమ్మరసం!

నిమ్మను పలు రకాలుగా ఉపయోగిస్తారు. నిమ్మకాయ రసం నీటిలో లేదా మజ్జిగలో పిండుకుని తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. నిమ్మరసంలో ఆమ్లాలు అధికం. అయినా జీర్ణక్రియ సమస్యలను పరిష్కరించటంలో నిమ్మరసం పాత్ర ఉంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగితే మేలు చేస్తుంది. 

ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే అది కాలేయానికి టానిక్‌గా పనిచేసి, పైత్యరసాల ఉత్పత్తిని పెంచుతుంది. నిమ్మలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై పలురకాల అంటురోగాల నుండి మనల్ని రక్షిస్తుంది. గొంతునొప్పి, ఆస్త్మా ఇబ్బందుల నుండి ఉపశమనం ఇచ్చే గుణం నిమ్మకు ఉంది