ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

INDIAN FESTIVALS ARTICLES - SIVARATHRI MAHATYAM - TELUGU PANDAGALU - LORD SIVA FESTIVAL ARTICLES COLLECTION


 శివరాత్రి మహాత్మ్యం

మన పండుగలన్నీ తిధులతోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ లెక్కన శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహా శివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాస శివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును మాస శివ రాత్రిగా చెప్తుంటారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. మాఘ బహుళ చతుర్దశి అర్దరాత్రి వరకు వ్యాపించి లేకపోతే అనగా అమావాస్య ముందే ప్రవేశించినట్లు అయితే అంతకుముందు రోజు మహా శివరాత్రి అవుతుంది. ఈ లెక్కన మహా శివ రాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు. మహా శివరాత్రి ఒకవేళ మంగళ వారం రోజున వస్తే దానికున్నవిశేషం చెప్పలేనిదని ధర్మ సింధువు మాట.

* శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి.

అవి ఒకటి పగటి పూట ఉపవాసం ఉండటం. రెండు ఆ రోజు రాత్రి జాగరణ చెయ్యడం.

ఇక పూజల సంగతి వేరేగా చెప్ప వలసిన పని లేదు.

శివ నామ స్మరణం ఎంతో ప్రధానం.

శివ రాత్రి రోజున చెయ్యవలసిన వాటిని శ్రీనాధ మహా కవి తన శివరాత్రి మహాత్యం కావ్యంలో ఇలా చెప్పాడు… .. ….

ఆ రోజు జాగరణ చేస్తే అది ప్రాజాపత్య వ్రత ఫలాన్ని ఇస్తుందన్నారు. అలాగే ఆ రాత్రి నాలుగు జాములలో అవధానపరులై శివ అర్చన చెయ్యాలి. ఈ వ్రతం చెయ్యటానికి అన్నికులాల వారూ అర్హులే. ఈ వ్రతం వల్ల మహా పాతకాలన్నీ పోతాయి.

మహా శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలను శివలింగం ఉద్భవ కాలం అని అంటారు.

ఆ సమయంలో రుద్రాభిషేకం , పంచాక్షరి మంత్ర జపం చెయ్యడం మంచిది. శివుడు జ్యోతి స్వరూపుడై లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం.

శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించటానికి ఒక పురాణ కథ ఉంది.

ఒక సారి బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి మాటా మాటా పెరిగి ఎవరు గొప్పో అని తేల్చుకోవాలనుకున్నారు. వీరి వాదన తార స్థాయికి చేరింది. ఇద్దరు సై అంటే సై అనుకున్నారు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి కలిగిన అహంకారాన్ని తొలగించి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే శివుడు మాఘ మాసం చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు.

బ్రహ్మ, విష్ణువు ఆ లింగం ఆద్యాంతాలను తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తాడు. మరోవైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఆది, తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని శివుడు వద్దకు వస్తారు. తాము ఓడిపోయామని ఒప్పుకుంటారు.

అప్పుడు శివుడు తన నిజ రూపంతో వీరికి దర్శనమిస్తాడు. అంతే కాకుండా అనుగ్రహించి వారిలోని అహాన్ని పోగొడతాడు. దానితో బ్రహ్మ, విష్ణువు శివుడి ఆధిక్యతను పూజించి కీర్తిస్తారు.

ఆ రోజే మహా శివ రాత్రి అయిందని కూడా అంటారు.

శివ పూజలో ప్రతిమ లింగాకారంలో ఉంటుంది. శివ పూజకు మారేడు దళం, అలంకరణకు తెల్ల పూల మాల ప్రధానం. శివునికి ఆవు నేతితో చేసిన దీపారాధనను కుడివైపున, నువ్వుల నూనె దీపారాధన ఎడమ వైపున పెట్టాలి.

శివ లింగాన్ని నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి చూడాలనే మాట వాడుకలో ఉంది. అదేంటో చూద్దాం.

శివుడు వాహనం నంది. నందీశ్వరుడు ఎప్పుడూ తన స్వామి తన మీదే తిరగాలనే కోరుకుంటాడు. . ఆలయాలలో శివుడుకి నేరుగా నంది ఉంటుంది. ఈ నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడాలన్నది సంప్రదాయం. అలా చూడటం వల్ల శివుడు సాక్షాత్తు నంది పైన కూర్చున్నట్టు కనిపిస్తాడు భక్తుడి కనులకు. అలాగే నందీశ్వరుడు కూడా తనపై ఎక్కి కూర్చున్న శివుడిని దర్శించినందుకు సంతోష పడి శివుడికి భక్తుడి విషయాన్ని చేరవేసి ఆనందాన్ని కలుగ చేస్తాడని పెద్దల మాట.

మహాభారతంలోని శాంతి పర్వంలో సుస్వరుదు అనే వ్యాధుడు తెలియక చేసిన శివపూజ వల్ల జన్మాంతరాన చిత్ర భానుడనే రాజై పుట్టినట్టు, ఆ చిత్రభానుడు శివరాత్రి వ్రతాన్ని చేసినట్లు భీష్ముడు చెప్తాడు. ఇలా శివరాత్రికి సంబంధించి వివిధ పురాణాలలోని కథలను చదివినా, భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసినా, జాగరణ చేసినా, పూజలు చేసినా ఎంతో మంచిది.