ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

KIDNEY CARE HEALTH TIPS IN TELUGU


మూత్రపిండాల ఆరోగ్యానికి

మూత్రపిండాలు నిరంతరాయంగా రక్తాన్ని వడపోస్తూ టాక్సిన్లను శరీరం నుంచి బయటకు నెట్టేస్తూ ఉంటాయి. ఇవి సమర్థవంతంగా పని చేయాలంటే పోషకాహారం తీసుకోవాలి, 

క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరించాలి. వీటితోపాటు ఆరోగ్య చిట్కాలను పాటించాలి.
రోజుకి 10 గ్లాసుల నీళ్లు తాగకపోతే మూత్రం చిక్కబడి వడపోత సమయంలో కిడ్నీల మీద భారం పడుతుంది.
ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం కలిపిన నీళ్లు తాగాలి. ఇలా చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. యాపిల్‌, ఆరెంజ్‌, దబ్బకాయ, ద్రాక్ష, క్యారెట్‌, బీట్‌రూట్‌, వీట్‌గ్రాస్‌, పార్ట్సీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

రాళ్లు ఏర్పడటం వల్ల తలెత్తే కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు, ఇతర సమస్యలను నివారించే ‘గోక్షుర’ అనే ఆయుర్వేద కషాయం తీసుకోవాలి. ఆయుర్వేదంలో సిస్టోన్‌ మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లకు, చంద్రప్రభ తరచుగా వచ్చే కిడ్నీ సమస్యలకు చక్కని పరిష్కారం.

సూప్‌ల తయారీలో మొలకెత్తిన కిడ్నీ బీన్స్‌, పసుపు, వెల్లుల్లి ఉపయోగించాలి.
టీ, కాఫీ, ఆల్కహాల్‌, పొగాకు వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. వీటి ఆనవాళ్లను మూత్రపిండాలు వడపోసేటప్పుడు మూత్రపిండాలు ఎక్కువ శాతం యాసిడ్‌ దాడి బారినపడతాయి.
డిటర్జెంట్లలో ఉండే హానికారక రసాయనాల ప్రభావం కూడా మూత్రపిండాలపై పడుతుంది. కాబట్టి వీటితో కూడుకున్న పనులు చేసేటప్పుడు చేతులకు తొడుగులు ధరించాలి. క్రిమి సంహార మందులు స్ర్పే చేసేటప్పుడు ముక్కుకు స్కార్ఫ్‌ ధరించాలి.

తలకు రంగులు వేసుకున్నప్పుడు ఎక్కువ నీళ్లతో రసాయనాలు వదిలేలా శుభ్రంగా స్నానం చేయాలి. అలాగే ఆ రసాయనాలు శరీరం నుంచి బయటకు వెళ్లడం కోసం ఎక్కువ నీళ్లు తాగాలి.
మల విసర్జనను ఎక్కువసేపు నియంత్రించుకోకూడదు.

సింథటిక్‌ మెటీరియల్‌తో తయారైన లోదుస్తులు ధరించకూడదు.

కాల్షియం సమృద్ధిగా ఉండే రాగులు, పళ్లు, కూరగాయలు తినాలి. మాంసకృతులు ఎక్కువగా ఉన్న పదార్థాలు క్షారత్వాన్ని కలిగి ఉంటాయి. దాంతో వాటిని తిన్నప్పుడు శరీర పీహెచ్‌ బ్యాలెన్స్‌ను స్థిరంగా ఉంచడం కోసం మూత్రపిండాలు ఎముకల్లోని కాల్షియంను ఉపయోగించుకుంటాయి. కాబట్టి రోజు మొత్తానికి సరిపడా కాల్షియంను ఆహారం ద్వారా అందించాలి.

కొబ్బరి నీళ్లు, సెలరీ, ఆకుకూరలు, దోసకాయలు, పెసర మొలకలు లాంటి శరీరాన్ని చల్లబరిచే ఆహారం ఎక్కువగా తినాలి.