చిరు జబ్బులు దూరం... (అల్లం దివ్యౌషధం )
మానవ శరీరానికి అవసరమైన పోషక విలువలు అల్లంలో సమృద్ధిగా వున్నాయి. ఆ పోషకాలు వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఎన్నోరకాల చిరుజబ్బులను, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కీలకపాత్రను పోషిస్తాయని అంటున్నారు. అల్లం టీ ప్రతిరోజూ రెండుపూటలా తీసుకుంటే జీర్ణ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. మలినాలను సైతం అది పూర్తిగా తుడిచిపారేస్తుంది.
అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్, యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంటి లక్షణాలు వుంటాయి. పొటాషియం, మెగ్నీషీయం, మ్యాంగనీస్, ఫాస్పరస్, జింక్, విటమిన్ ఎ, సి, ఇ, బికాంప్లెక్స్ వంటి ఎన్నో ఖనిజాలు, పోషక విలువలు వుంటాయి. ఇన్ని ఆరోగ్యకరమైన విలువలను కలిగిన ఈ అల్లాన్ని రోజువారి డైట్ లో వాడితే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.
ఇంకా అల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కడుపునొప్పి, అజీర్ణం, హార్ట్ బర్న్, వికారం, బాడీ పెయిన్, ఆర్థరైటిస్ నొప్పి, జలుబు, దగ్గు, ఇతర శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలను, ఫీవర్, పీరియడ్స్‌లో తిమ్మెర్లను నివారించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చిరుజబ్బులు దరిచేరకుండా చేస్తుంది. కాబట్టి.. ఈ అల్లంను రెగ్యులర్ డైట్‌లో వాడటం ఎంతో శ్రేయస్కరం. అందుకే.. దీనిని దివ్యౌషధంగా పేర్కొంటారు