ఏలే ఏలే మరదాలా.!
.
బావా మరదళ్ళ సరస సల్లాపాల యుగళ గీతం!
.
అచ్చ తెలుగు పదాల అందమైన పొందికలో జానపదుల గుండెల్ని పరవశింపచేసే రీతిలో
రచన చేసిన అన్నమయ్య భావుకతకు జోహార్లు అర్పించవలసిందే.
.
.
ఏలే ఏలే మరదలా
చాలు చాలు చాలును
చాలు నీతోడి సరసాలు బావ
గాటపు గుబ్బలు కదలగ కులికేవు
మాటల తేటల మరదలా
చీటికి మాటికి చెనకేవు వట్టి
బూటకాలు మాని పోవే బావ
అందిందె నన్ను అదిలించి వేసేవు
మందమేలపు మరదలా
సందుకో తిరిగేవు సటకారి ఓ బావ
పొందుకాదిక పోవే బావా
చొక్కపు గిలిగింత చూపుల నన్ను
మక్కువ సేసిన మరదలా
గక్కున నను వేంకటపతి కూడితి
దక్కించుకొంటివి తగువైతి బావ.!
.
బావా మరదళ్ళ సరస సల్లాపాల యుగళ గీతం!
.
అచ్చ తెలుగు పదాల అందమైన పొందికలో జానపదుల గుండెల్ని పరవశింపచేసే రీతిలో
రచన చేసిన అన్నమయ్య భావుకతకు జోహార్లు అర్పించవలసిందే.
.
.
ఏలే ఏలే మరదలా
చాలు చాలు చాలును
చాలు నీతోడి సరసాలు బావ
గాటపు గుబ్బలు కదలగ కులికేవు
మాటల తేటల మరదలా
చీటికి మాటికి చెనకేవు వట్టి
బూటకాలు మాని పోవే బావ
అందిందె నన్ను అదిలించి వేసేవు
మందమేలపు మరదలా
సందుకో తిరిగేవు సటకారి ఓ బావ
పొందుకాదిక పోవే బావా
చొక్కపు గిలిగింత చూపుల నన్ను
మక్కువ సేసిన మరదలా
గక్కున నను వేంకటపతి కూడితి
దక్కించుకొంటివి తగువైతి బావ.!