ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU PURANA STORY - PARASURAMA AGNATHAVASAMU


పరశురామ అఙ్ఞాతవాసము 

రేణుకా,జమదగ్నిల పుత్రుడు పరశురాముడు పితృవాక్యపరిపాలన వలన తల్లిని సంహరించి,మరలా అదే తండ్రీ వరప్రభావముచే తల్లిని పునర్జీవింపచేసిన విశిష్టలక్షణుడు.ఇంతటి పరశురాముడు ఊగ్రుడు,ముక్కొపి.శివుని మెప్పించి ఆయిధముగా గొడ్డలిని సంపాదించినవాడు.తన తండ్రికి జరిగిన ఘోరమునకు ప్రతీకారముగా 21 మార్లు క్షత్రియవంశ నిర్మూలన కావించి సకల ధరామండలము అంతటిని తన ఆధినములో తెచ్చుకున్నవాడు. ఇంతవరకు కథ బాగానేవున్నది.అసలు మలుపు ఇక్కడే ప్రారంభము. క్షత్రియిలందరి నిర్మూలన రాజ్యాలన్ని పరశురామ ఆధినములో కానీ పరశురాముడు పాలనకాక తన తపస్సులో.మరి ఇంకేముంది రాజులేని రాజ్యములో పరిపాలన లేక, రాజ ఉద్యొగుల దుర్మర్గాలకు ప్రజలు బలి.శిక్షలు లేక నేరాలు పెచ్చరిల్లటము.ఇలా అనేక ఇబ్బందులతో రాజ్యాలన్ని అల్లకల్లొలముగా వున్నాయి.అంతా అరాచకము.

ఇది గమనించిన సకల మునిగణ, పండిత సభలో ఈ సమస్యపై చర్చ.చివరకు ఓక నిర్ణయానికి వచ్చి భాధ్యత కశ్యపునకు అందచేసినారు. పరశురామునకు కబురుపంపి ఆయినను ఈ మునిగణ పేరలొగమునకు ఆహ్వానము.ఆంత పరశురాముడు రాగా ఈ సభనిర్ణయము ఇది అంటు మీవద్ద వున్న సకల రాజ్యాలను కశ్యపునకు ధారపొయాలని తెలిపినారు.ఆపై పరశురాముదు సకలభూమండలాన్ని కశ్యపునకు ధారపొయగా, దానితో కశ్యపుడు ఈ రాజ్యలన్నిటికి రాజుగా మారిపొయాడు. దానితో కశ్యపుడు ,పరశురాముని ఉగ్రలక్షణము తెలిసినవాడై మరలా పరశురాముడు జనజీవనస్రవంతిలో వుంటే మరలా ఇటువంటి ఇబ్బంది వస్తొందని పరశురాముని సముద్రతీరప్రాంతమునకు వెళ్ళమని అదేశించాడు.దానితో పరశురాముడు నేటి గోవా ప్రాంతములో శిక్ష, అఙ్ఞాతవాసము, సముద్రతీరప్రాంత ప్రవాసము అక్కడకు వెళ్ళిపొయాడు.