ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU VASTHU TIPS ABOUT NYRUTHI



నైరుతి దిశలో ఎంత బరువుంటే అంత శుభకరమట..!

నైరుతి దిశలో ఎంత బరువులుంటే అంత శుభకరమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నైరుతి మూలకు గ్రహాధిపతి రాహువు. పాలకుడు నిరతుడు అనే రాక్షసుడు. రాక్షస బుద్ధి ఎక్కడకు పోతుంది. అందుకే బరువులు కాస్త మోపితే రాక్షసుడిని అల్లరి తగ్గుతుంది. బరువు పెరిగితే నిరతుడు అదుపులో ఉంటాడనేందుకే నైరుతి భాగంలో ఎక్కువ బరువులు ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. నైరుతి దిశ వెలితిగా ఉండటం పనికిరాదు.

జననానికి ఈశాన్యము కారణమైతే, మరణానికి నైరుతి కారణమవుతుంది. అందుచేత నైరుతి బాగా ఎత్తుగా, ఉన్నతంగా, బలంగా, బరువుగా ఉంటే శుభఫలితాలుంటాయి. నైరుతి ఉన్నతంగా ఉన్న ఇంటివారు సకల సంపదలతో తులతూగుతారు. అష్టైశ్వర్యాలతో అలరారుతారు. ఇంట పెద్దవారికి సమాజంలో ఓ గుర్తింపు, మాటకు బలం వస్తుంది. భద్రతా భావము చక్కగా ఉంటుంది. వీరు ఇతరులకు భయపడటం అరుదు.

కానీ నైరుతి దశ గుంతలు కలిగి, మూలమట్టమునకు సరిగా లేకుండా, వాకిళ్ళు ఉండి నైరుతికి ఏదైనా వీధిపోటు ఉన్నా, నైరుతిలో బావులు ఉన్నా ఆ ఇంటి యజమానికి కష్టాలు తప్పవు. ఇలాంటి గృహాలకు చెందిన వారు దుర్మార్గపు ఆలోచనలు, దుష్ప్రవర్తనకు లోనవుతారు. ఇంకా దీర్ఘ రోగాలు, దారిద్ర్యం వంటి అశుభ ఫలితాలు ఉంటాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.