ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE IN TELUGU ABOUT GREAT TEMPLE - KUKKE SUBRAHMANYA SWAMY TEMPLE IN KARNATAKA INDIA


 కుక్కే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం, 
ప్రాకృతిక సౌందర్యారాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం,దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరు కు 100 కి.మీ.ల దూరంలో కుమార పర్వతశ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం సుబ్రహ్మణ్య. పూర్వం దీనిని కుక్కే పట్నం అనే పిలిచేవారు. క్రమంగా కుక్కె సుబ్రహ్మణ్య గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది పరశురామక్షేత్రాలలో ఒకటి. కుమారస్వామి(సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తుటారు.

* స్థలపురాణం

స్కాందపురాణం లో సనత్‌కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణం సుబ్రహ్మణ్య స్థలపురాణం గురించి చెపుతోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సంహరించి తన శక్తి అయుధాన్ని ఇక్కడి ధారానదిలో శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత ఈ కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో విశ్రాంతి తీసుకొంటున్నపుడు ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా కుమారస్వామి అంగీకరిస్తాడు. ఆతరువాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించడంవల్ల ఈ క్షేత్రం వెలసింది. ఆది శంకరాచార్యులు తన ధర్మ ప్రచార పర్యటనలో సుబ్రహ్మణ్య ను దర్శించారు. ఆయన విరచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో "నమస్తే సదా కుక్కుటేశోగ్ని కేతా స్స్మస్తాపరాధం విభోమే క్షమస్వ" అన్నాడు.

* దర్శించవలసిన దేవతలు

సుబ్రహ్మణ్యస్వామి

సుబ్రహ్మణ్యస్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా, భక్తులు మాత్రం పృష్టభాగం నుండి ముందుకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భగుడికి, ఈమధ్య నిర్మించబడ్డ వసారాకు మధ్యన వెండితాపడాలతో అలంకరింపబడ్డ స్తంభం ఉంటుంది. వాసుకి విషపు బుసలనుండి రక్షింపపడడానికి ఈ స్తంభాన్ని నిర్మించారు అని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపటి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రహ్మణ్యస్వామి , మధ్యభాగంలో వాసుకి, కింద్రిభాగంలో ఆదిశేషు ఉంటారు.

కుమారధారా నది మీద వున్న సుబ్రహ్మణ్య స్వామి వూళ్ళో వున్న సుబ్రహ్మణ్య దేవాలయం లేక కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం చూసి తీరవలసిన వాటి లో ఒకటి. ఈ గుడి చుట్టూ నదులు, పర్వతాలు, అడవులు. ముఖ్యంగా కుమార పర్వత౦ పరుచుకుని వుంటాయి. ఈ గుడి శివుడి రెండో కుమారుడు, కార్తికేయుడు గా పిలవబడే సుబ్రహ్మణ్య స్వామికి, నాగ రాజు వాసుకి కి నిలయం.

సుబ్రహ్మణ్య దేవాలయంలో బయట లోపల వున్న హాళ్ళు గర్భాలయానికి దారి తీస్తాయి. ఒక ఎత్తైన వేదిక మీద సుబ్రహ్మణ్య స్వామి తో పాటు వాసుకి విగ్రహాలు వున్నాయి. హిందూ పురాణాల ప్రకారం మరో నాగ రాజు ఆది శేషుడి విగ్రహం కూడా గర్భాలయం లో చూడవచ్చు. గర్భాలయానికి, మండప ద్వారానికి మధ్య వెండి తో కప్పబడిన గరుడ స్థంభం వుంది. స్థానికుల ప్రకారం యాత్రికులను ఈ స్తంభంలో నివసించే వాసుకి నుంచి వచ్చే విషం నుంచి కాపాడడానికి ఈ స్తంభానికి తాపడం చేశారు.

సర్ప దోష శాంతికి చేసే ప్రక్రియలకు ఈ పవిత్ర దేవాలయం ప్రసిద్ది. ఈ గుడిలోని ప్రధాన పర్వ దినం తిపూయం నాడు అనేకమంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం అనే మరో రెండు ప్రధానమైన సర్ప దోష పూజలు కూడా ఈ గుడిలో చేస్తారు.

సుబ్రహ్మణ్య దేవాలయం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్న హరి హరేశ్వర దేవాలయం చూడాలని యాత్రికులకు సిఫార్స్ చేయబడుతోంది. శివ కేశవుల నిలయమైన ఈ దేవాలయానికి వెళ్తే ఇక్కడి నుంచి పశ్చిమాద్రి కనుమల అందం చూడవచ్చు.

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయాన్ని సందర్శించి నప్పుడు ‘కుక్కే శ్రీ అభయ మహాగణపతి గా పిలవబడే అభయ మహాగణపతి దేవాలయాన్ని కూడా చూసిఇక్కడి నిర్మాణ శైలి నేపాలి శైలిని పోలి వుంటుంది – 21 అడుగుల గణపతి విగ్రహం ఏక రాతి విగ్రహాలన్నిటి లోకి పెద్దదని చెప్తారు.