బాదం చేసే మేలు
బాదం నూనెతో రోజూ ఉదయం ఓ పది నిమిషాలు మర్దనా చేసుకుంటే ముఖంపై నలుపు, ఎరుపు మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
కళ్లకింద ఉబ్బు తగ్గాలంటే బాదం నూనెను వేళ్లతో తీసుకొని, సున్నితంగా మసాజ్ చేసుకుంటే ఉబ్బుతోపాటు నల్లని వలయాలు కూడా తగ్గుతాయి.
ఎండకు ఎక్స్‌పోజ్ అయ్యే భాగంలో చర్మం కమిలినట్లుగా తయారవుతుంది. కొందరికి దురద కూడా వస్తుంటుంది. ఇలాంటివారు రాత్రి పడుకునేముందు బాదం నూనెతో ఓ పదినిమిషాలు మసాజ్ చేసుకుని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మ సమస్యలు తగ్గటమేగాక చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.
నానబెట్టిన బాదంపప్పులను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పచ్చి పాలను కలిపి ముఖానికి ప్యాక్ చేసి, పదిహేను నిమిషాల తర్వాత కడుక్కుంటే పొడిచర్మం ఉన్నవారి ముఖం నిగ నిగలాడుతుంది.
బాదంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతిమంతంగా ఉంచుతుంది. గుండెకు బలాన్నిస్తుంది. రోజూ 4 బాదం పప్పులు తినడం మంచిది.