కొబ్బరి పాలతో జుట్టు మృదువుగా
కొబ్బరి పాలు జుట్టు కుదుళ్లను దృఢం చేస్తాయి. కొబ్బరి పాలను మాడుకు పట్టించి తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మాయిశ్చరైజర్ లభించి మృదువుగా అవుతుంది. కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో 2-3 గంటలు ఉంచాలి. తర్వాత బయటికి తీసి, దానిపైన ఏర్పడ్డ పొరను తొలగించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, మాడుకు పట్టించి, వేడినీళ్లలో ముంచిన ఉన్ని టవల్‌ను తలకు చుట్టాలి. గంట సేపు అలాగే ఉంచి, షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు మృదువుగా అవుతుంది.