కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి
పెళ్లై, పిల్లలున్న ఉద్యోగినులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటి పనులూ, పిల్లల బాధ్యతలూ, ఉద్యోగంతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. కంటి నిండా నిద్ర కూడా ఉండదు. దాంతో ప్రభావం కళ్ల మీద పడినప్పుడు కనురెప్పలూ, కనుబొమ్మలు అదురుతుంటాయి. నిద్రలేని కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. అప్పుడు సమయానికి తిన్నా, పని తగ్గించుకున్నా కూడా అలసటగానే అనిపిస్తుంది. కళ్లు మండుతాయి. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం కనురెప్పలు అదే పనిగా అదురుతుంటాయి. అలాంటప్పుడు బాగా నిద్రపోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కళ్లకు సాధ్యమైనంతవరకు విశ్రాంతి ఇవ్వాలి. కాంటాక్ట్ లెన్స్ అధికంగా వాడినా.. కళ్లద్దాలను మార్చకుండా దీర్ఘకాలం వాడుతున్నా.. కళ్లు ఎక్కువ శ్రమకు గురైనా కళ్లు అదురుతాయి