పిచ్చి కుదిరింది.
మా మావయ్య, ఒక సంవత్సరంగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాడండీ...’ సైకాలజిస్ట్ దగ్గరకొచ్చి చెప్పాడు శంకర్రావు.
‘‘ఏం చేస్తున్నాడు?’’
‘‘ప్రొద్దున్నుంచీ సాయంత్రం వరకూ కుర్చీలో కూర్చుని చేతుల్లో స్టీరింగ్ ఉన్నట్లు ఊహించుకుని కారు నడుపుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడండీ!’’
‘‘అది కారు కాదనీ, కుర్చీ అనీ నువ్వు చెప్పలేదూ?’’
‘‘ఎలా చెప్తానండీ! సాయంత్రం కారు కడిగినందుకు నాకు రోజుకి పాతిక రూపాయలిస్తూంటేనూ!’’
‘‘మరిప్పుడెందుకు ఇక్కడికి వచ్చినట్లు?’’
‘‘ఇప్పుడు కారు తనే కడుక్కుంటున్నాడండీ...’’