ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

RAMU THE PRINCE STORY IN TELUGU

యువరాజు


అనగనగా ఒక రాజు గారు వుండేవారు. ఆ రాజు గారికి పిల్లలు పుట్టలేదంట. దానితో తన తరవాత ఆ రాజ్యం ఎవరు పాలించాలా అని దిగులు పడుతూ వుండేవారు.

ఒక రోజు బాగా ఆలోచించి తన రాజ్యం లోని పిల్లలందరినీ ఒక చోటకి రమ్మని చాటింపు వేయించాడు. పిల్లలందరూ రాగానే వాళ్ళందరికీ తలా కొన్ని విత్తనాలు ఇచ్చి ఒక మాసం లోపు ఎవరి విత్తనాలయితే బాగా మొలుస్తాయో వారిని యువరాజు గా చేస్తానని చెప్పాడు.

అదే రాజ్యం లో రాము అని ఒక చిన్న పిల్లవాడు వుండేవాడు. రాము చాలా అమాయకుడు, మంచివాడు. రాము కూడా రాజు గారి దగ్గర విత్తనాలు తీసుకొని ఇంటికి వచ్చేసాడు.

ఒక మాసం తర్వాత అందరు మళ్లీ రాజు గారి దగ్గరకు వెళ్లారు. అందరి దగ్గర మంచి మొక్కలు వున్నాయి. రాజు గారు ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి వాళ్ళ మొక్కలని చూస్తున్నారు. అలా వస్తూ చివరకు రాము దగ్గరకి వచ్చి మొక్కను చూపించమన్నారు.

కానీ రాము తనకిచ్చిన విత్తనాలు మొక్క మొలవలేదని చెప్పాడు.

రాజు గారు సంతోషించి అందరితో
"నేను ఇచ్చిన విత్తనాలకు అసలు మొక్కలు మొలవవు. కానీ అందరు రాజ్యం కోసం మొక్కలు తెచ్చారు. రాము ఒక్కడే నిజాయితీగా నిజం ఒప్పుకున్నాడు. కాబట్టి రామునే ఈ రాజ్యానికి కాబోయే యువరాజు."
అని చెప్పారు.

అందరు తప్పు తెలుసుకొని రాము ని యువరాజుగా అంగీకరించారు.