ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU PUJA INFORMATION ABOUT CHANDRADOYA UMA VRATHAM


చంద్రోదయ ఉమావ్రతము

విజయదశమి పండుగ తరువాత వచ్చే పండుగ అట్లతదియ . ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఈ పండుగ రోజున చంద్రోదయ ఉమావ్రతాన్ని ఆచరిస్తారు . ఈ పండుగ రోజు ముందురోజు న స్త్రీలు టం పాదాలకు , చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు . తదియ నాడు అట్లు వేసి అమ్మవారికి నివేదన చేస్తారు .

పూజా మందిరం లో ఓ పీటను వేసి .. ఆ పీటకు పసువు రాసి కుంకుమ అద్ది ... ఆ పీటపై బియ్యం పోసి చదును చేయాలి . పసుపు తో గౌరమ్మను చేసి కుంకుమతో అలంకరించి తమలపాకు పై ఉంచి అలంకరించిన పీట పై గౌరమ్మను ఉంచాలి .చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచరాల తో ఉమాదేవిని పూజించాలి .

గౌరీదేవే ఉమాదేవి ... అందుకే పసుపు ముద్దతో గౌరీ దేవిని చేస్తారు . చంద్రోదయం ను చూసి ఉమాదేవిని పూజిస్తారు కనుకనే "చంద్రోదయ ఉమావ్రతం" అంటారు . అమ్మవారికి పది అట్లను నైవేద్యం గా పెట్టి ఒక ముత్తిడువకు పది అట్లు వాయినం ఇచ్చి పది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు .