ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU PURANA RAMAYANA STORY ABOUT THE BROTHER OF RAVANABRAHMA - THE PRINCE - VIBHISHANA - KING OF LANKA


విభీషణుడు

రామాయణంలో రావణాసురుడి వైఖరి పట్ల అంతా ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంటారు. అదే సమయంలో ఆయన సోదరుడైన విభీషణుడిని మాత్రం అంతా మనసులోనే అభినందిస్తుంటారు. ఒకే కడుపున జన్మించిన ఈ సోదరుల మనస్తత్వంలో ఇంతటి తేడా ఎలా వచ్చిందనే సందేహం అందరిలోనూ తలెత్తుతూనే వుంటుంది. విభీషణుడి పుట్టుక గురించి తెలుసుకుంటే ఆ సందేహం కాస్తా తొలగిపోతుంది.

ఒకసారి పులస్త్యుని కుమారుడైన విశ్రవసుడు మలయపర్వతం పై తపస్సు చేసుకుంటూ వుంటే సుమాలి కూతురైన 'కైకసి' అక్కడికి వచ్చింది. విశ్రవసుడిని మోహించి తనకి సంతానాన్ని ప్రసాదించమని కోరింది. అసుర సంధ్య వేళ కోరడం వలన ఆమె కడుపున అసురులు పుడతారని చెప్పాడు విశ్రవసుడు. కైకసి కన్నీళ్ళ పర్యంతం కావడంతో, ఆమె మూడవ పుత్రుడికి మాత్రం అసుర గుణాలు ఉండవనీ ... అతని ద్వారా రాక్షస జాతికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని చెప్పాడు.

ఫలితంగా కైకసికి రావణాసురుడు ... కుంభకర్ణుడు ... విభీషణుడు ... శూర్పణఖ అనే కూతురు జన్మించారు. ఈ ముగ్గురు కుమారులు కూడా బ్రహ్మ దేవుడి కోసం తపస్సు చేసి అమూల్యమైనటువంటి వరాలను పొందారు. రావణాసురుడు ... మండోదరిని, కుంభకర్ణుడు ... వజ్ర జ్వాలను, విభీషణుడు ... సరమ అనే గంధర్వ కన్యను వివాహమాడారు. కొంత కాలం తరువాత శ్రీ రామచంద్రుడి భార్య అయిన సీతాదేవిని రావణాసురుడు అపహరించి తెచ్చి అశోక వనంలో ఉంచాడు.

సీత జాడ తెలుసుకున్న ఆంజనేయుడు రావణాసురుడిని హెచ్చరించి వెళ్లాడు. రావణాసురుడి వైఖరి పట్ల విభీషణుడు తీవ్రమైన అసహనాన్ని ... నిరసనను వ్యక్తం చేశాడు. రాముడు సాధారణ మానవుడు కాదనీ ... శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమని చెప్పాడు. సీతను రాముడికి అప్పగించి క్షమాపణ కోరడం మంచిదనీ ... లేదంటే రాక్షస జాతి అంతరిస్తుందని హితవు చెప్పాడు. అయినా రావణాసురుడు వినిపించుకోకపోగా, సభికుల మధ్య ఆయనను అవమాన పరిచాడు.

ఈ విషయం తెలుసుకున్న కైకసికి విశ్రవసుడి మాటలు గుర్తుకు వచ్చాయి. దాంతో రాముడిని శరణువేడి తమ వంశాన్ని నిలపమని విభీశణుడిని కోరింది. వెంటనే విభీషణుడు సముద్రానికి అవతల తీరంలో నున్న శ్రీ రామచంద్రుడిని కలుసుకున్నాడు. ఆయన గురించి హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు, అతిధి మర్యాదలు చేశాడు.

రావణాసురుడి సైనిక బలం గురించి ... ఆయన బలహీనతల గురించి విభీషణుడి ద్వారా తెలుసుకుని యుద్ధ రంగంలోకి దిగాడు రాముడు. యుద్ధంలో రావణాసురుడిని సంహరించి విభీషణుడికి పట్టాభిషేకం జరిపించాడు. అలా విభీషణుడు అవతారమూర్తి అయిన శ్రీ రాముడికి సహాయపడటమే కాకుండా, తన వంశం అంతరించకుండా చేసి తల్లి కోరిక నెరవేర్చినవాడైనాడు.