ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHAT IS LUNAR ECLIPSE - CHANDRA GRAHANAM - DOs and NO DOs AT THE TIME OF LUNAR ECLIPSE ACCORDING TO HINDU BELIEFS AND TRADITIONS


04-04-2015

చంద్ర గ్రహణం

గ్రహణ సమయములో చేయకూడనివి...!
. గ్రహణ కాలంలో భోజనం చేయడం, నీరు త్రాగడం, సంభోగాది కార్యాలు చేయరాదు. గ్రహణం సమయంలో నిద్రపోవడం, మలమూత్రాదులు విసర్జించడం, తైలాభ్యంగన స్నానం చేయకూడదు.
గ్రహణ సూతకంలో పిల్లలు, వృద్ధులు, రోగాలతో బాధపడుతున్నవారికి తినడంపై ఎలాంటి నిషిద్ధం లేదు. గ్రహణం పట్టిన సమయంలో వండిన అన్నం, తరిగిన కూరగాయలు, పండ్లు కలుషితమౌతాయి. వీటిని భుజించకూడదు.
కాని నూనె, నెయ్యితో చేసిన వంటకాలు ఉదాహరణకు అన్నం, నెయ్యి, నూనె, పాలు, పెరుగు, లస్సీ, వెన్న, పన్నీరు, ఊరగాయలు, చట్నీ, మురబ్బాలో నువ్వులు లేదా దర్బలు ఉంచితే ఆ పదార్థాలు కలుషితం కావంటున్నారు జ్యోతిష్యులు. డ్రై ఫుడ్‌లపై నువ్వులు లేదా దర్బలు ఉంచాల్సిన అవసరం లేదు.
గర్భిణీ స్త్రీలు గ్రహణం పట్టే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం.. ఇత్యాది వంట పనులు చేయకూడదు.
గ్రహణ సమయంలో చేయాల్సినవి,
గ్రహణం సమయంలో ఏదైనా మంత్రాన్ని పఠిస్తే అది శీఘ్రంగా ఫలిస్తుందంటున్నారు జ్యోతిష్యులు. ప్రధానంగా మహా మృత్యంజయ మంత్రాన్ని జపిస్తే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
గర్భిణీ స్త్రీలు గ్రహణం పట్టే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం.. ఇత్యాది వంట పనులు చేయకూడదు.
ఈ గ్రహణం పట్టే కాలంలో వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్రాన్ని జపించండ వల్ల ఫలితం ఆశాజనకంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.