బెల్లం ఆవకాయ
కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో,
కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో,
ఆవపిండి - అరకిలో, బెల్లం - 1 కిలో, నూనె - తగినంత
తయారీ:
తయారీ:
బెల్లాన్ని తురుముకోవాలి. మామిడి ముక్కల్లో కారం, ఉప్పు, ఆవపిండి, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ముక్కలు తడిసేలా కొద్దిగా నూనె కూడా వేసి కలపాలి. తర్వాత ఈ ముక్కల్ని ఎండలో పెట్టాలి. రెండు రోజుల్లో ముక్కలకు పట్టిన బెల్లం పాకంలాగా తయారవుతుంది. అప్పుడు ముక్కల్ని జాడీలో వేసి, మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మగ్గిన తర్వాత తీసుకోవాలి. కొందరు తాలింపు కూడా వేసుకుంటారు. నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కూడా బాగుంటుంది.