ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DELICIOUS EGG VEGETABLE FRIED RICE RECIPE MAKING IN TELUGU


స్పైసీ ఎగ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్

కావల్సిన పదార్థాలు: 

బాస్మతి రైస్ : 2cups 
ఎండుమిర్చి: 2-3 
వెల్లుల్లి రెబ్బలు: 4-6 
అల్లం తురుము: 1/2tsp 
నూనె లేదా నెయ్యి: సరిపడా
క్యారెట్లు: 2 
చైనీస్ క్యాబేజ్ తురుము: 1/2cup 
గుడ్లు: 2 
ఉల్లికాడలు: 2 
ఫ్రెష్ బఠానీలు: 1/2cup 
సోయాసాస్: 1tsp 
వెనిగర్: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత 
కొత్తిమీర : కొద్దిగా


తయారుచేయు విధానం: 

1. ముందుగా బాస్మతి బియ్యంను శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్ళు పోసి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. 
2. అలాగే గుడ్డును పగులగొట్టి గిన్నెలో పోసి అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. 
3. తర్వాత మిక్స్ జార్ లో వెల్లుల్లి, ఎండుమిర్చి, చిటికెడు ఉప్పు వేసి మెత్గా పేస్ట్ చేసుకోవాలి. 
4. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అల్లం తురుము వేసి వేయించుకోవాలి. 
5. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి. అందులోనే సోయా సాస్, వెనిగర్ కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 
6. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుొకన్న అన్నం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకొని. 
7. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత గుడ్డు మిశ్రమాన్ని పోసి వేగించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న వెజిటేబుల్ రైస్ వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే స్పైసీ ఎగ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ..