బంగారు పాపాయి బహుమతులు పొందాలి.!
.
ఈ లలితగీతాన్ని రచించినవారు మంచాళ జగన్నాధరావు.
.
ఈ లలితగీతాన్ని రచించినవారు మంచాళ జగన్నాధరావు.
దీనికి సాలూరు రాజేశ్వరరావు స్వరరచన చేశారు. (రాగం: శుద్ధధన్యాసి తాళం: ఖండచాపు).
.
1945 లో రావు బాలసరస్వతీ దేవిగారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా జగన్నాధరావుగారు ఈ పాటా రచించి ఇచ్చారు.
ఆ తర్వత రావు బాలసరస్వతీ దేవి గానంచేయగా గ్రామఫోన్ రికార్దు విడుదల చేశారు. ఆ తరం వారిని ఎంతగానో ఆకట్టుకుంది ఈ పాట.
.
బంగారు పాపాయి బహుమతులు పొందాలి,
పాపాయి చదవాలి మామంచి చదువు ||
పలు సీమలకు పోయి, తెలివిగల పాపాయి
కళలన్ని చూపించి ఘనకీర్తి పొందాలి
ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి! ||
మా పాప పలికితే మధువులే కురియాలి!
పాపాయి పాడితే పాములే ఆడాలి!
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప?
ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి,
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు||
తెనుగుదేశము నాది, తెనుగు పాపను నేను
అని పాప జగమంతా చాటి వెలయించాలి,
మా నోములపుడు మాబాగా ఫలియించాలి!||