ఆనెలు హాని చేయవు
అరిపాదాలల్లో ఆనెలు పుడితే ఆ బాధ వర్ణణాతీతం. ముఖ్యంగా కాళ్లకి చెప్పులు లేకుండా పొలాల్లో తిరిగే వారి పాదాలకి ఆనెలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బయట ప్రదేశాల్లో, ఇసుకప్రాంతాల్లో తిరగాలంటే ఆనెలు ఉన్న వారికి నరకయాతనే. ఆనెలను పోగొట్టే హోమ్‌రెమిడీస్ ఏంటో తెలుసుకుందాం. ఆనెలు మనిషికి హాని చేయవు. అయితే చూడగానే భయపెడతాయి.
కలబందని పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ఆనెకి పూయాలి. ఈ భాగంలో కాలికి బ్యాండేజ్ చుట్టాలి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మంచిఫలితం ఉంటుంది.
తులసి ఆకుల్ని ఆముదంనూనెతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఆనె ఉండే చోటు పట్టించి కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి.
వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి ఆనె ఉండే చోటు కట్టుగా కట్టాలి. వెల్లుల్లి బాక్టీరియాని చంపేస్తుంది. దీంతో పాటు ఆనెలకి చక్కటి మందులాగా పనిచేస్తుంది.
ఒక చుక్క వెనిగర్ ని ఆనెపై వేసి అక్కడ కాస్త దూదిని పెట్టి కట్టు కట్టి అలాగే కొద్దిసేపు ఉంచటం వల్ల తగిన ఫలితం కనిపిస్తుంది.