గోధుమ దోస: హెల్తీ అండ్ టేస్టీ
కావల్సిన పదార్థాలు:
కావల్సిన పదార్థాలు:
గోధుమ పిండి: 2cups
కొబ్బరి : 2tbsp
నీళ్ళు: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా గోధుమలను నీళ్ళలో వేసి బాగా కడగాలి. తర్వాత గోధుమల నుండి నీరు బాగా వంపేసి ఒక అరగంట గోధుమలు పక్కన పెడితే, నీరు మొత్తం కారిపోయి డ్రై అవుతాయి.
2. తర్వాత అరగంట తర్వాత ఈ గోధుమలను మిక్సీ జార్ లో వేసి రఫ్ గా పొడి చేసుకోవాలి.. మీ దోసె పౌడర్ రెడీ.
3. ఇప్పుడు దోసె పిండిని తయారుచేసుకోవాలి. పిండిని మిక్సీలో వేసి, పిండితో పాటు, కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్ళు పోసి దోసె పిండిలా గ్రైడ్ చేసుకోవాలి .
4. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వంపుకోని అందులో రుచికి సరిపడా ఉప్పువేసి బాగా మిక్స్ చేయాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నూనె రాసి వేడి అయ్యాకో గోధుపిండిని దోసెలా వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి .
6. అంతే దోసె రెడీ అవ్వగానే గ్రీన్ చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయండి చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా కరివేపాకు చట్నీకి కూడా బాగుంటుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా ఆరోగ్యం మరియు రుచికరం.