ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

THIEF NUMBER ONE - KIDS MORAL CHANDAMAMA STORIES COLLECTION


దొంగను మించిన దొంగ

పూర్వం జంపయ్య, మొగలయ్య అనే పేరు మోసిన దొంగలు ఉండేవారు. ఎవరి ప్రాంతాలలో వారు పెద్ద దొంగగా పేరు సంపాదించారు. ఒకరి గురించి మరొకరు విన్నారు కానీ, ఒకరినొకరు కలుసుకోలేదు.

అనుకోకుండా ఒకసారి ఇద్దరూ కలుసుకున్నారు. జంపయ్యను తన ఇంటికి భోజనానికి పిలిచాడు మొగలయ్య. అతడి తెలివితేటలు ఏమాత్రమో తెలుసుకుందామనే కుతూహలంతో మాత్రమే వెళ్లాడు జంపయ్య. మొగలయ్య బంగారు గిన్నెలో భోజనం పెట్టాడు. జంపయ్య కన్ను ఆ గిన్నెపై పడింది. ‘ఎలాగైనా దాన్ని దొంగిలించాలి’ అనుకున్నాడు. మొగలయ్య అతని ఉద్దేశాన్ని పసిగట్టి జాగ్రత్త కోసం ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ గిన్నెను కొంచెం కదిలించినా ఒలికిపోయేటంత నిండా నీటిని పోసి, దాన్ని ఉట్టి మీద పెట్టాడు. సరిగ్గా ఆ ఉట్టి కిందే అతను పడుకున్నాడు.

జంపయ్యకు ఆ ఇంట్లోనే మరొక చోట పడక ఏర్పాటు చేశాడు. మొగలయ్య గాఢ నిద్రలో ఉండగా జంపయ్య వెళ్ళి కొన్ని బూడిద కచ్చికలు తెచ్చి ఒక్కొక్కటిగా బంగారు గిన్నెలో వేశాడు. అవి నీటిని పీల్చుకున్నాయి. జంపయ్య ఆ గిన్నెను దొంగిలించి, దగ్గరలో ఉన్న చెరువులో మొలలోతు నీళ్లలో గిన్నెను పాతిపెట్టి, గుర్తుగా ఒక కర్రను గుచ్చి తిరిగి వచ్చి ఏమీ తెలియనట్లు పడుకున్నాడు.
మొగలయ్య మెలకువ వచ్చి చూడగా గిన్నె కనిపించలేదు.

అది జంపయ్య పనే అనుకొని అతని దగ్గరకు వచ్చి పరిశీలించగా మొలవరకు నీటితో తడిసి ఉండటం గవునించాడు. వెంటనే చెరువు దగ్గరకు పరుగెత్తి మొగలయ్య గుర్తుగా పెట్టిన కర్ర దగ్గర వెతికి గిన్నెను తెచ్చుకున్నాడు.

మరునాడు జంపయ్య ఆ గిన్నెను చూసి ‘‘ఇలాంటివి నీ దగ్గర రెండు గిన్నెలు ఉన్నాయా?’’ అని అడిగాడు. అప్పుడు మొగలయ్య తన దగ్గర ఒక్క గిన్నె మాత్రమే ఉందని, అది నిన్నటిదేనని చెప్పాడు. జంపయ్యకు అంతా అర్ధమయిపోయింది. ‘దొంగను దొంగే పట్టాలి కదా’! అని మనసులో అనుకుని ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు.