ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DASARA FESTIVAL 16-10-2015 - SRI MAHALAKSHMI DEVI AVATHAR


నాలుగవ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా ఆలంకరిస్తారు.

దుర్గాసప్తశతి అంతర్గతమైన దేవీ చరిత్రలో ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మీ మహాసరస్వతి అనే రూపాలను ధరించి దుష్ట సంహారం చేసినట్లు చెప్పబడింది. ఈ మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అపరిమితమైన పరాక్రమాన్ని చూపించి, మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి, మహిషాసుర మర్ధినిగా ప్రసిద్ధి పొందింది. తలచినంతనే అష్ట రూపాలతో సాక్షాత్కరించి, ఈ శరన్నవరా త్రులలో అష్ట సిద్ధులను ప్రసాదించే మహాలక్ష్మీదేవి, తన రెండు చేతుల్లో కమలాలను ధరించే వరదాభయహస్తాలతో, గజరాజు తనను కొలుస్తుండగా, కమలాసీనురాలుగా దర్శనమిస్తుంది.