ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DASARA FESTIVAL TELUGU RECIPES - DHADHOJANAM RECIPE IN TELUGU


దధ్యోదనం 

కావల్సినవి: బియ్యం - కప్పు, చిక్కటి గడ్డపెరుగు - ముప్పావుకప్పు, పాలు - అరకప్పు, వెన్న - చెంచా, కీరదోస తురుము, క్యారెట్ తురుము - పావుకప్పు చొప్పున, కొత్తిమీర - కట్ట (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి - రెండుమూడు (తరగాలి), ఉప్పు - తగినంత, నెయ్యి - రెండు చెంచాలు, సెనగపప్పు - అరచెంచా, ఆవాలు, జీలకర్ర - రెండూ కలిపి చెంచా, కరివేపాకు రెబ్బలు - మూడు, అల్లం తరుగు - కొద్దిగా.

• తయారీ: బియ్యాన్ని కడిగి అందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. మూడు కూతలు వచ్చాక దింపేయాలి. ఈ అన్నాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అన్నం కొద్దిగా వేడి తగ్గాక వెన్నా, కాచి చల్లార్చిన పాలూ, పెరుగూ వేసి కలపాలి. అందులో తగినంత ఉప్పూ, కీరదోస తురుమూ, క్యారెట్ తురుమూ వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి కరిగించి అందులో ఆవాలూ, జీలకర్రా, సెనగపప్పూ, అల్లం, పచ్చిమిర్చి ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ వేయించి.. అన్నంలో వేసేయాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లాలి.