సీతాదేవి పూర్వజన్మ
సీతాదేవి పూర్వ జన్మలో వేదవతి. ఈమె తండ్రి 'కుశధ్వజుడు, తల్లి -మాలావతి . సీత జన్మించినప్పుడు వేద ఘోష విన్పించడం వల్ల " వేదవతి" అని పేరు పెట్టేరు .
తండ్రి వేదవతిని విష్ణుమూర్తికి ఇచ్చి వవాహం చేయాలని భావిస్తాడు . వేదవతి కుడా నిరంతరం విష్ణు మూర్తిని ధ్యానిస్తూ ఉండేది. అయితే ఒక రాక్షసుడు ఈమెను కోహిస్తాడు. వేదవతి ని ఇవ్వడానికి కుశధ్వజుడు అంగీకరించడు . అప్పుడా రాక్షసుడు కుశాధ్వజుదుని చంపేస్తాడు .
మాలావతి కుడా దుక్కం తో మరణిస్తుంది. తల్లి దండ్రులను పోగొట్టికున్న వేదవతి అడవికే వెళ్లి విష్ణుముర్తికోసం కటోర తపస్సు ప్రారంభిస్తుంది. లంకాధీశుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి పెళ్ళాడమని కోరుతాడు . వేదవతి ... తానూ విష్ణుమూర్తిని తప్ప ఎవరినీ వివాహము చేసుకోనని చెప్తుంది. అయినా కామము తో రావణాసురుడు వేదవతి పై చేయివేస్తాడు. పరపురుషుడు తాకినా దేహం తో జీవించడం ఇష్టం లని వేదవతి యోగాగ్ని ని సృష్టించుకొని అందులో దగ్దమైపోతుంది. రావణుని వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞా చేస్తుంది. కొంతకాలానికి లంకా నగరం లో ఒక కమలం లో ఈమె జన్మిస్తుంది. ముందుగా రావణుడే చూస్తాడు ... ఈమె జన్మ అతనికి అరిస్తామని జ్యోతిష్కులు చెప్పగా రావణుడు ఆ పాపను ఒక బంగారుపెట్టేలో పెట్టి సముద్రం లో విడిచిపెడతాడు. ఆపెట్టే కొంతకాలానికి మిధిలా నగర ప్రాంతానికి చేరుకొని అక్కడ భూమిలో నాగాతిచాలులో జనకమహరాజుకు దొరుకుతుంది
* జననం
మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు. గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు.