మల్లె పూల నగవది మత్తునే జల్లులే !
కల్లలేని మనసది కరుణనే జూపులే !
నల్ల కలువ కనుగవ నటనలే జేయులే !
విల్లు వంటి నడుమది విస్తులే గొల్పులే !
పిల్ల పలుక దొలకును ప్రేమభరిత సుధలూ !
వెల్లు వెత్తి యురుకును విరిసేటి మమతలూ !
చిన్న దాని నడకా చిలుకు హృదిని పగలే !
వన్నె లాడి విరుపూ వలపు లొలుక సెగలే !
యెన్న లేని సొగసది ఎదను తడుము కవనం !
పొన్న పూ సోయగం పులకించు ను నయనం !
చిన్ని చిన్ని పెదవులు సిగ్గులిడు మదనాలు !
కన్నె వన్నె పరువము కవ్వించు కవనాలు !
ద్విరదగతి రగడ :
.................... డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ .
కల్లలేని మనసది కరుణనే జూపులే !
నల్ల కలువ కనుగవ నటనలే జేయులే !
విల్లు వంటి నడుమది విస్తులే గొల్పులే !
పిల్ల పలుక దొలకును ప్రేమభరిత సుధలూ !
వెల్లు వెత్తి యురుకును విరిసేటి మమతలూ !
చిన్న దాని నడకా చిలుకు హృదిని పగలే !
వన్నె లాడి విరుపూ వలపు లొలుక సెగలే !
యెన్న లేని సొగసది ఎదను తడుము కవనం !
పొన్న పూ సోయగం పులకించు ను నయనం !
చిన్ని చిన్ని పెదవులు సిగ్గులిడు మదనాలు !
కన్నె వన్నె పరువము కవ్వించు కవనాలు !
ద్విరదగతి రగడ :
.................... డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ .