జుట్టుకు వేపాకు బెస్ట్
1.వేప సహజ ఔషధ గుణాల నిధి. వేపతో చర్మసంబంధమైన వాటితో పాటు జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
2.వేపాకు చూర్ణాన్ని వారానికి ఒకసారి జుట్టుకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
3.వేపనూనెతో వారానికి రెండుసార్లు హెడ్ మసాజ్ చేస్తే జుట్టు రాలటం, చుండ్రు సమస్యలు పోతాయి. తలలో ఉండే చిన్నపాటి గాయాలు త్వరగా మానిపోతాయి. జుట్టు మృదువుగా తయారవుతుంది.
4.జుట్టు నిర్జీవంగా ఉంటే వేపాకు పేస్ట్‌తో నెలకు రెండుసార్లు మాస్క్ వేసుకుంటే కురుల్లో మెరుపు వస్తుంది.
5.తలలో ఎక్కువగా దురద పెడుతుంటే వేపాకులు నాన బెట్టిన నీళ్లతో తలను శుభ్రపరిస్తే చక్కటి గుణం కనిపిస్తుంది.
గోరు వెచ్చని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వేపనూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కురులు నిగనిగలాడతాయి.
గుప్పెడు వేపాకుల్ని బాగా ఉడికించి, పేస్ట్ చేసి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
ఒక బౌల్‌లో వేపాకుపే్‌స్టను తీసుకుని అందులోకి గుడ్డు తెల్లసొన వేసి మిశ్రమంగా కలపాలి. ఈ మిశ్రమంతో తలకు మాస్క్ వేసుకుంటే జుట్టు సమస్యలు తొలగిపోతాయి.