నల్లమలకొండల్లో ఉన్న మాధవి దేవి శక్తిపీఠం!
108 శక్తి పీఠాల్లో శ్రీశైలం మాధవి దేవి ఆల యం సుప్రసిద్ధమైనది. సతీదేవి కంఠభాగం ఇక్కడ పడినట్లుగా చెపుతారు. అరుణాసురడనే రాక్షసుని అమ్మవారు ఈ ప్రదేశంలో వధిం చినట్లు ప్రతీతి. ఇదే శ్రీశైలం. దీనిని దక్షిణ కైలాసమని, దక్షిణ కాశి అని అభివర్ణిస్తారు. ఈ శక్తిపీఠ క్షేత్రములో, శ్లోకం ప్రకారం (భ్రమరాంబ అనబడే) మాధవీదేవి ఆరాధించబడుతున్నది. ఆదిశంక రాచార్యులు ఇక్కడ తపస్సు చేసినట్లు, సౌందర్యలహరీ స్త్రోత్రం ఇక్కడే రచించిన ట్లు, దీనిని కనకధారా స్తోత్రంగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నందికొట్కూరు తాలూకాలో ఉంది శ్రీశైల దేవీ పీఠం. ఇది నల్లమలకొండల్లో ఉంది. మాచర్ల దాకా రైల్లో వెళ్లవచ్చు. డోర్నాల నుండి ఘాట్ రోడ్డులో 51 కి.మీ. హైదరాబాద్ నుంచి బస్సుల్లో నేరుగా వెళ్ళొచ్చు. ఇకపోతే అహోబిలము 160 కి.మీ స్వామివారు మల్లికార్జునుడు. ఈ లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలల్లో ఒకటి రాష్ట్రంలోని అన్ని పట్టణాల నుండి బస్సుల్లో ఇక్కడకు చేరవచ్చును.