ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHAT IS BHAKTHI - IMPORTANCE OF BHAKTHI IN OUR DAILY LIFE


భక్తి వలన కలుగు ప్రయోజనము ఏమి ?

ప్రపంచంలో ప్రతి కష్టమనకు కారణం ప్రేమ అలాగే ప్రపంచ శాంతికి ప్రేమే కారణం కాగలదు , మనిషి ఒక వ్యక్తి మీద తన కుటుంభం మీద లేదా వస్తువు మీద , మతం మీద , డబ్బు మీద మొదలైన వాటిపై విపరీతమైన ప్రేమ పెంచుకుని అవియే లోకంగా బ్రతుకుతూ వాటి కోసం ఏ మోసనికైన , ఏ దారుణానికైనా సిద్దపడుతున్నాడు, ఆలోచిస్తే వీటికి మూలం ప్రేమే , ప్రేమలు అనేకం, రాక్షశ ప్రేమయే వ్యామోహము,భగవంతుని మీద ప్రేమయే భక్తి సహజంగా ప్రతీ జీవిలోను ఈ ప్రేమ గుణం ఉంటుంది, కాని మన ఈ ప్రేమని భగవంతునికి అంకితం చేస్తే ప్రపంచ శాంతి కాగలదు ఏ విధముగాననగా చెట్టుకు నీరు మనము వెళ్ళులో పోస్తే చాలు కొమ్మలకు ,ఆకులకు అదే చేరవేస్తుంది మనము ప్రత్యేకంగా చెట్టుకు కొమ్మకు నీరు పోయవలిసిన అవసరంలేదు, అలాగే మన ప్రేమను (భక్తిని) భగవంతునిపైన కేంద్రకరిస్తే మనము చేసే ప్రతి పనిలోనూ ,ప్రతీ జీవిలోనూ మనము భగవంతునిని చూస్తాం.ఈ విధముగా ఎప్పుడైతే మనము భగవంతుని చూస్తామో, మనలోని స్వార్థం , ఈర్ష్య భావం, హింసాత్మక భావం మొదలైన కల్మష గుణాలన్నీ మనము నెమ్మదిగా కోల్పోతాము అప్పుడు మనం అందరితో సత్సంభంధంతో మెలుగుతాం, ప్రతి ఒక్కరు ఈవిధముగా జీవిస్తే అందరకీ శాంతి లభిస్తుందని దీనివలన ప్రపంచ శాంతి కలుగుతుందని , భాగావాతంలో చెప్పబడి ఉంది , ఈ విషయాన్నీస్వయానా శ్రీ చైతన్య మహాప్రభువు(శ్రీ మహావిష్ణు అవతారం ) తన శిష్యులకు బోధించాడు