అతిగా తాగితే గ్రీన్‌టీ అనర్థమే!
ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా గ్రీన్‌టీ తాగడం మంచిదేగానీ... అతిగా తాగితే మాత్రం అనర్థమేనంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు! డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అనే ఈగలకు అధిక మోతాదులో గ్రీన్‌టీ ఇవ్వడం వల్ల, వాటిలో ఎదుగుదల, ప్రత్యుత్పత్తి సామర్థ్యం తగ్గాయనీ... మనుషుల్లోనూ ఇదే ప్రభావం ఉండొచ్చని వారు చెబుతున్నారు.సాధారణం కంటే ఎక్కువగా గ్రీన్‌టీ తాగిన ఈగలు ఆకలికి, అధిక వేడికి తట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోయినట్లు గుర్తించామన్నారు. ఆడ ఈగల్లోనైతే, పునరుత్పత్తి సామర్థ్యం 17% తగ్గిపోయిందనీ... వాటికి తక్కువ సంఖ్యలో, సాధారణం కంటే చిన్న పరిమాణంలో పిల్లలు పుట్టాయన్నారు. ఎలుకలు, కుక్కులపైనా అధిక మోతాదు గ్రీన్‌టీ ప్రభావం దాదాపు ఇలాగే ఉన్నట్లు వివరించారు. ''తక్కువ మోతాదులో తీసుకుంటేనే గ్రీన్‌టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. అదేపనిగా అధిక మోతాదులో దానిని తాగడం వల్ల శరీరంలోని కణాలు మృత్యువాత (అపోప్టోసిస్)కు గురవుతాయి'' అని పరిశోధనకు నేతృత్వం వహించిన మెహ్తాబ్ జాఫ్రీ తెలిపారు.