బీట్ రూట్ గురించి పూర్తి వివరణ
************************** ******
బీట్ రూట్ రూట్ శాస్త్రీయ నామము " beta vulgaris" . ఆకులు , దుప , రెండు తినేందుకు వాడతారు . టేబుల్ షుగర్ తయారీలో బీటు దుంపను వాడుదురు . "batanins " అనే పదార్ధము తో పేస్టు , జాం , ఐస్ క్రీం వంటి వాటి కలర్ ను ఇంప్రూవ్ చేయడానికి పనివచ్చును . శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పుడు బీట్‌రూట్ రసం తాగితే త్వరగా కోలుకుంటారు.
ఆకృతిని బట్టి దీనిలో ఎన్నో రకాలు ఉన్నాయి . యూరప్ లోని మెడిటరేనియన్ ప్రాంతం లేదా పశ్చిమ ఆసియా ప్రాంతానికి చెందినదిగా భావిస్తారు . గత రెండువేల సంవత్సరాలుగా కూరగా వాడుతున్నారు . ప్రాచీన గ్రీకులు , రోమన్లు కూరగాయగా వాడినట్లు చెప్తారు . అక్కడ నుండి ఇంగ్లండ్ , ప్రాన్స్ , జర్మనీ లకు రొమన్ల ద్వారా చేరింది . మనదేశం లో అన్ని ప్రదేశాలలో విసృతం గా సాగుచేస్తున్నారు .
వైద్య పరంగా
************
1 . డయాబెటిక్ లివర్ ను కాపాడును ,
2 . కొలెస్టిరాల్ ను తగ్గించును ,
3 . మలబద్దకం ను నివారించును ,
4 . బీట్ రూటు రసము రక్తపోటును తగ్గించు .
5 . బోరాన్ ఎక్కువగా ఉన్నందున "aphrodisiac "గా సెక్స్ హోర్మోన్స్ ఎక్కువచేయును .
6 . కొంతవరకు కాన్సర్ నివారణ కు ఉపయోగ పడును .
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే బీట్‌రూట్ రసాన్ని తాగండి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. కాబట్టి రోజూ 250 మి.గ్రా. పచ్చి బీట్‌రూట్ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది. బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.
పోషకాలు : 100 గ్రాములలో
************************** *
మాయిశ్చర్ ----87.7 శాతము , ప్రోటీన్లు -------1.7 %, ఖనిజాలు -----0.8%, పీచు --------0.9% కార్బోహైడ్రేట్స్ -8.8%, కాల్సియం ----18 మి.గ్రా. శాతము , ఫాస్పరస్ -----55 మి.గా %, ఇనుము -----1.0 మి.గా%, జింక్ --------0.2% , థయామిన్---0.04%, రిబోఫ్లేమిన్---0.09%, నియాసిన్----0.4 మి.గా %, విటమిన్ సి --10% , కాలరీస్ -----43 కేలరీలు ,
సౌందర్యానికి రూట్ విటమిన్ బి దండిగా ఉండే బీట్‌రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా. హార్ట్ బీట్ రూట్ సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్‌రూట్ ఒకటి.
దీని లాభాలు ఎన్నో తెలుసా ?
************************** *
బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
బీట్‌రూట్ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది.
క్రీడాకారులు బీట్‌రూట్ జ్యూస్ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు.
ఓ తాజా పరిశోధన ప్రకారం రోజుకి 400మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్‌రూట్ జ్యూస్ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది.
పరుగు వేగాన్ని పెంచే బీట్‌రూట్
పరుగు పోటీలో పాల్గొనేవారి వేగాన్ని, సామర్థ్యాన్ని బీట్‌రూట్ పెంచుతుంది. ఎందుకంటే ఇందులో నైట్రేట్‌లు ఉండటమేనని అమెరికాలోని లూయిస్ విశ్వవిద్యాలయ అధ్యయనం తెలిపింది. అధ్యయనం కోసం పరిశోధకులు ఆరోగ్యంగా ఉన్న 11 మంది స్త్రీ, పురుషులను ఎంపిక చేసుకున్నారు. వ్యాయామానికి గంట ముందు కాల్చిన బీట్‌రూట్‌లో కొద్ది భాగాన్ని తినాలని వారికి చెప్పారు. బీట్‌రూట్ తిన్న తర్వాత గంటకు సగటున వీరు 12.3 కిలోమీటర్లు ట్రెడ్ మిల్‌పై పరుగెత్తారు.
**************************