ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

REDUCE HEADACHE WITH BADAM HEALTH TIPS IN TELUGU


తలనొప్పిని తగ్గించే బాదం! 

తలనొప్పితో బాధపడేవాళ్లు బాదం గింజల్ని తిని చూడండి అంటున్నారు పరిశోధకులు. బాదం గింజల్లో నొప్పిని తగ్గించే పదార్థం ఉంటుంది. ఆ పదార్ధాన్నే యాస్ర్పిన్‌, మెగ్నీషియం, విటమిన్‌-ఇ, సాల్సిన్‌లలో ఉంటుంది అంటున్నారు మేరీలాండ్‌ యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు. ‘‘మైగ్రెయిన్‌ లేని వాళ్లతో మైగ్రెయిన్‌తో బాధపడేవాళ్లని పోల్చినప్పుడు వీళ్లలో మెగ్నీషియం తక్కువ స్థాయిలో ఉంటుంది. బాదంలో మెగ్నీషియం సరిపడా ఉంటుంది. అందుకని బాదం గింజల్ని తినడం వల్ల మైగ్రెయిన్‌ తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. లేదా భవిష్యతలో తలనొప్పి రాకుండా నివారించొచ్చు. మెగ్నీషియం మైగ్రెయిన్‌ తలనొప్పుల్ని నివారించడంలో ఎంత ప్రభావంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు చేసిన పరిశోధనలో అది 41.6శాతంగా ఉన్నట్టు వెల్లడైంది.

పరిశోధనలో పాల్గొన్న వాళ్లకు ప్రతిరోజూ తగిన మోతాదులో ఈ పోషకాన్ని అందించాం. ఇందులో ఉండే లవణం కండరాలకు ఉపశమనం కలిగించడమే కాకుండా నరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అందువల్లే ఒత్తిడి లేదా టెన్షన్‌ వల్ల వచ్చే తలనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది బాదం. ఇదొక్కటే కాకుండా ఇందులో ఉండే విటమిన్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. బాదంగింజల్లో విటమిన్‌ బి2 మెండుగా ఉంటుంది. అందుకనే నాలుగువందల మిల్లిగ్రాముల బాదం తిన్న వాళ్లలో మైగ్రెయిన్‌ తరచుగా రావడం అనేది తగ్గిపోతుంది. మెగ్నీషియం, బి2 విటమిన్లు మైగ్రెయిన్‌ను తగ్గిస్తాయని మరోసారి నిరూపితమైంది’’ అంటున్నారు పరిశోధకులు. మరింకేం మాత్రల్ని పిప్పర్‌మెంట్‌ బిళ్లల్లా తీసుకునే బదులు బాదం గింజల్ని తింటే అనారోగ్యం దూరమవుతుంది. అందుకే ఆహారంలో బాదం గింజల్ని తీసుకోవడం మొదలుపెట్టండి.