శాస్త్రీయ సంగీత రారాజు త్యాగరాజు
త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.
'ఎందరో మహానుభావులు'' అనే పదం తెలుగునాటనే కాక, దక్షిణ ప్రాంతంలో వాడుకలో వినిపించే నానుడియైన చరణం. అలానే 'చక్కని రాజమార్గం ఉండగా, సందుల దూరనేల ఓ మనసా!' 'దొరకునా ఇటువంటి సేవ', 'ఏమని పొగడదురా?' వంటి చరణాలు తెలుగు ప్రజల మదిలో నిలిచిపోయాయి. దాదాపు రెండు వందల ఏళ్లకు పూర్వం త్యాగబ్రహ్మం రచించిన కృతులలోని చరణాలు స్థిరంగా నిలిచిపోవటానికి కారణం.. ఆయన సాహిత్యంలోని నిర్ధిష్టత, సంగీతంలో సారస్వత. భారతీయ సంగీతాల్లో ఉత్తరదేశానికి చెందిన హిందుస్థానీ, దక్షిణానికి కర్నాటక సంగీతం ప్రాచుర్యం పొందాయి. త్యాగబ్రహ్మకు పూర్వం కర్నాటక శాస్త్రీయ సంగీతానికి చెందిన సాహిత్యం సంగీత ప్రాచుర్యం గురించి వినికిడిలో లేదు.
.. త్యాగరాజ కీర్తనలతో పంచరత్న కీర్తనలుగా పేర్కొనబడేవి.
'దుడుకుగల నన్నేదొర - కొటకు బ్రోచురా?' సాధించెనే మనసా', కనకన రుచిరా'
ఎందరో మహానుభావులు' జగదానందకారక' త్యాగరాజు కీర్తనల్లో సాహిత్యం పాలు తక్కువ కాగా, సంగీతం పాలు ఎక్కువ. అందువల్లనే తమిళనాట సంగీతాభిమానులు ఆయన కీర్తనలను ఆదరించిన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఎనభై ఏళ్లు నాదమే యోగంగా, సంగీతమే శ్వాసగా జీవించిన నారబ్రహ్మ త్యాగరాజు 1847 జనవరిలో మృతి చెందారు. ఆయన స్మృత్యర్థం నివాళ్లర్పిస్తూ ప్రతిఏటా ఆయన జన్మించిన తిరువాయురులో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో త్యాగరాజు ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీత విధ్వాంసులు అందరూ పాల్గొని కచేరీ చేస్తారు. అదే విధంగా దేశంలోనే కాక విదేశాల్లోనూ పలుచోట్ల ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు. మన హైదరాబాద్‌లో సైతం శ్రీత్యాగరాయ గానసభ, నల్లకుంటలోని రామాలయంలో శ్రీరామగానసభ, మారేడ్‌పల్లి, రాంకోఠిలో ఉన్న ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల్లోనూ త్యాగరాజు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు.