ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ON SWAMI VIVEKANANDA IN TELUGU


(నేడు స్వామి వివేకానంద జయంతి)
సెప్టెంబర్ 11, 1893: విశ్వ మత మహాసభలలో స్వామి వివేకానంద అద్భుత ప్రసంగం ( తెలుగు లో)

అమెరికన్ సోదర సోదరీ మణులారా , ( 7000 మంది ఉపస్థితుల నుండి 3 నిమిషాల పాటు ఆగకుండా కర తాళ ధ్వనులు మ్రోగాయి )

నాకు మీరిచ్చిన మనోపుర్వక స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడటం నాకు మహానందదాయకం ప్రపంచం లోకెల్లా అత్యంత పురాతన మైన సనాతన ధర్మం తరపున మీకు నా అభివాదాలు , సమస్త మతాలకు , సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన దర్మం పేర మీకు నా అభివాదాలు , అనేక జాతులతో , అనేక సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేర మీకు నా అభివాదాలు .

సహన భావాన్ని వివిధ దేశస్థులకు తెలిపిన ఘనతా గౌరవమూ సుదూర దేశస్థులైన ప్రాచ్యులకు చెందడం ఏంటో సమంజసమని తత్ప్రతినిధులను గురించి ఈ సభా వేదిక నుండి మీకు తెలిపిన వక్తలకు నా అభివాదాలు , సహనాన్ని , సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను . సర్వమత సహనాన్నే కాక , సర్వ మతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం. సమస్త మత సమస్త దేశాల నించీ పరపీడితులై , శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ ల నిరంకుశత్వానికి గురై తమ దేవాలయం తుత్తునియలైన ఏటనే దక్షిణ భారత దేశానికి వచ్చి శరణు పొందిన యూదులను - నిజమైన యుడులనదగ్గవారిలో మిగిలిన వారిని మా కౌగిట చేర్చుకోన్నామని తెలుపడానికి గర్విస్తున్నాను .

సోదరులారా ప్రతీ రోజు కోట్లాది మానవులచే పారాయణ గావించబడే స్తోత్రం నుండి , అతి బాల్యం నుండి నేను పారాయణ చేస్తున్న ఒక స్తోత్రం నుంచి కొన్ని చరణాలు ఉదహరిస్తాను: " వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో సంగమించినంట్లే , వివిధ భావాలచే మనుషులు అవలంభించే వివిధ ఆరాధనామార్గాలు వక్రాలై కనబడిన , అవక్రాలై కనబడిన , సర్వేశ్వరా , నిన్నే చేరుతున్నవి ."

" ఎవరు ఎ రూపంలో నన్ను గ్రహిస్తారో , నేను వారి నాలాగే అనుగ్రహిస్తూన్నాను. ఎల్లరూ సమస్త మార్గాలచేతను తుదకు నన్నే చేరుతున్నారు " అని గీతలో తెలుపబడ్డ అద్బుత సిద్ధాంతాన్ని ప్రపంచములో మహోన్నత సమావేశాలలో ఒకటైన ఈ మతమహాసభే సమర్థిస్తూ , ముక్త కంఠమతో లోకానికి చాటుతుందని చెప్పనొప్పుతుంది, శాఖాభిమానం, స్వ మత దురభిమానం, దాని వాళ్ళ జనించిన మూర్ఖాభావేషము సుందరమైన యీ జగత్తును చిరకాలంగా ఆక్రమించివున్నది . భూమిని అవి దౌర్జన్యమయం గావించి, అనేక పర్యాయాలు మనవ రక్తసిక్తం చేసాయి . ఈ ఘోర రాక్షసులు చేలరేగి వుండకుంటే, మానవ సమాజం నేటికంటే విశేశాభివృద్ది పొంది ఉండేది . కాని వాటి అవసాన సమయం ఆసన్నమైనది, ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మ్రోగించబడిన గంట సర్వ విధాలైన స్వ మత దురభిమాననికి పరమత ద్వేషానికి కత్తితో గానివ్వండి , కలంతో గానివ్వండి, సాగించబడే నానా విధాలైన హింసకు మాత్రమెకాక, ఒక్క గమ్యన్నే ప్రా పెంచబోయే జనం కొందరిలోని నిష్టుర ద్వేషభావాలకు శాంతి పాఠం కాగలదని నేను మనస్పూర్తిగా ఆశిస్తున్నాను