బెల్లము , Jaggery
బంగారు వన్నెతో చూడడానికి అందము గా , తియ్యగా మంచివాసనతో ఉండే బెల్లము ఆరొగ్యానికి చాలా ప్రయోజనకారి . ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి బెల్లం తయారీకి ప్రసిద్ధి. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్లనుండి కూడా బెల్లం తయారవుతుంది. బెల్లంలో పంచదారకు మల్లే పెద్దగా రసాయనాల వాడకం ఉండదు. పైగా ఖనిజాలు అధికం. అందుకే దీన్ని మెడిసినల్ చక్కెర అంటారు. ప్రతి 100 గ్రా బెల్లంలో 2.8గ్రా మినరల్ సాల్ట్‌లు ఉంటాయి. అంటే కిలోకి 28 గ్రాములు. అదే పంచదారలో అయితే కిలోకి కనీసం 300 మిల్లీగ్రాములు కూడా ఉండదు. బెల్లంలోని మెగ్నీషియం నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది. పొటాషియం అయితే కణాలలోని ఆమ్లాలని నియంత్రిస్తుంది. ప్రతి వంద గ్రాముల బెల్లం నుంచి 383 కెలొరీల శక్తిని, 95 గ్రా కార్బోహైడ్రేట్లని, 80 మిల్లీ గ్రా క్యాల్షియం, 40 మిల్లీ. గ్రా. పాస్ఫరస్, 2.6మి గ్రా ఇనుమును పొందవచ్చు.
ఉపయోగాలు
పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.
భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. తియ్యని పిండివంటలు తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు.
పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే .. గ్లాసు బెల్లం పానకం లో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపసయనం కలుగుతుంది .
అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది . అజీర్తి సమస్యలుండవు .జీవ క్రియ ను వేగవంతం చేస్తుంది .
కాకర ఆకులు , నాలుగు వెల్లుల్లి రెబ్బలు (రెక్కలు) , మూడు మిరియాల గింజలు , చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపుతల వారం రోజులు తీసుకున్నా , లేదా గ్లాసు పాలలో పంచధరకి బదులు బెల్లం వేసి రోజు త్రాగిన ... నెలసరి సమస్యలు ఉండవు .(బహిష్ట సమస్యలు ఉండవు .).
నేయి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నా చోట పట్టు వేస్తె భాధ నివారణ అవుతుంది .
ముక్కు కారడము తో బాధపడుతున్న వారికి ... పెరుగు , బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది .
బెల్లం , నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది .