ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PONGAL FESTIVAL SWEET PONGAL WITH RICE - COCONUT ETC


స్వీట్ పొంగల్ పోహా రిసిపి: సంక్రాంతి స్పెషల్

బియ్యం నూక - 2 cups పెసరపప్పు - 1 cup కొబ్బరి తురుము - 1 cup (grated) బెల్లం - 1 cup (grated) యాలకలు - 2 to 3 నెయ్యి - 1 cup 
ద్రాక్ష - 1/2 cup జీడిపప్పు - 1/2 cup 

చక్కెర పొంగల్ : పొంగల్ స్పెషల్ రిసిపి
తయారుచేయు విధానం: 1. ముందుగా పాన్ తీసుకొని అందులో పెసరపప్పు వేసి 5నిముషాలు ఫ్రైచేసుకోవాలి. 2. తర్వాత ప్రెజర్ కుక్కర్ తీసుకొని వేయించుకొన్న పెసరపప్పును అందులో వేసి సరిపడా నీళ్ళు పోయాలి. 3. కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. 4. అంతలోపు, బీటన్ రైస్(బియ్యం నూక) తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 5. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నీళ్లు పోసి బాగా మరిగించాలి. అందులోనే బెల్లం కూడా వేసి బెల్లం కరిగే వరకూ ఉడికించాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
6. ఇప్పు చిన్న పాన్ మరో స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి అందులో ద్రాక్ష మరియు జీడిపప్పు వేసి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. 7. 15నిముషాల తర్వాత బెల్లం ఉడుకుతున్న పాన్ లో నానబెట్టుకొన్న బియ్యంను మరియు ముందుగా ఉడికించిన పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. 8. మెత్తం మిశ్రమం మెత్తగా ఉడికే సమయంలో నెయ్యిలో వేయించి పెట్టుకొన్న ద్రాక్ష యాలకలు మరియు జీడిపప్పు అందులో వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. 9. అంతే వేడి వేడిగా రుచికరమైన స్వీట్ పొంగల్ రిసిపి రెడీ.