ఆంగ్లమాసం ప్రకారం సంక్రాంతి జనవరి నెలలో 14 లేక 15 తేదీలలో సూర్యగమనము ననుసరించి వస్తుంది. పుష్యమాసమున వచ్చు సంక్రాంతి మూడురోజుల పండుగలాగ జరుపుకొంటారు. మొదటిరోజున ప్రాతఃకాలమున భోగిమంటలతో ఈ పండుగ నారంభిస్తారు. ఆడపిల్లలు ఇళ్ళలో బొమ్మలకొలువులు ఏర్పరుస్తారు. ముత్తయిదువులనాహ్వానించి వారి ఆశీర్వాదమును పొందుతారు. రెండవరోజు ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ రోజున దానాదులను ఆచరిస్తారు. మూడవరోజు కనుమను పశువుల పండుగగా జరుపుకొనుట ఆచారంగా వస్తున్నది.
ఒక బీజమును నాటినపుడు అందుండి మొలక బయటకు వస్తుంది. అప్పటినుండి దానికవసరమగు రక్షణను నాటిన వారు కల్పించగా, అది ఏపుగా పెరిగి మనకవసరమైన పుష్పాలను గాని, కాయలు గాని ఇవ్వగలదు. అదిచ్చిన ఫలితమును చూచి మన కృషి ఫలించినదనే సంతృప్తి తప్పక ఉంటుంది కదా. అలాగే దంపతులు కూడ పుట్టిన పిల్లలను వారి పోషణకు తగినవి సమకూర్చుతూ జాతకర్మాదులను తీర్వహించి విద్యాబుద్ధులను నేర్పి పెంచినపుడు పైన చెప్పినట్లు తీగలు, చెట్లకు జ్వలె వారున పెంచిన వారికా ఆనందమును, తృప్తిని కలిగించాలి కదా. ఏ చెట్టుకాని, తీగకాని, తగిన శక్తిని గ్రహించిన తరువాత నా జీవితం నాదే అన్నట్లుండదు. పెంచిన వారి పట్ల కృతజ్ఞతతో ముందు చెప్పినట్లు కృతజ్ఞతా భావంతో తలలు వంచి అందుబాటులో ఉంటాయి. అలాగే పిల్లలు కూడా పెంచిన వారిపట్ల కృతజ్ఞతా భావంతో, వినయవిధేయలతో ఉండాలి.
ఇది అలవడాలంటే శాస్త్రాలలో చెప్పినట్లు వానిపై నమ్మకముండి, వాటిలో చెప్పినట్లు ఆయా కాలాలకు సంబంధించిన విధులను నిర్వర్తించాలి. తన కుటుంబానికి సుఖశాంతులను కలుగజేయాలి.
ఒకవేళ ఇవన్నీ చేయలేకపోయిన దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రమున చెప్పినట్లు నడచుకోవాలి. నాకే మంత్ర యంత్రములు తెలియవు. నిన్ను స్తుతించటం తెలియదు. ఆహ్వాన ధ్యానములును తెలియవు. నీ స్తుతి కథలు తెలియవు. నీ ముద్రలు తెలియవు. వ్యాకులతతో ఉన్నప్పుడు విలపించటం తెలియదు. కానీ మాతా! క్లేశమును హరింపజేసే నీ అనుసరణం మాత్రమే నేనెరుగుదును-అనాలి.
కాబట్టి నీవేమి చేయలేని స్థిిలో నున్నప్పుడు కనీసం ఆ దేవిననుసరించుటయైనా చేయాలి.