తెలుగు వారి పండుగ సంక్రాంతి వేళ
సంక్రాంతి స్పెషల్ నువ్వుల అరిసెలు తయారు చేసేవిధానం
కావలసినవి
బియ్యం -1 కిలో
బెల్లం -అరకిలో
నువ్వులు -50 గ్రాములు
నూనె -తగినంత
తయారు చేసేవిధానం
సంక్రాంతి స్పెషల్ నువ్వుల అరిసెలు తయారు చేసేవిధానం
కావలసినవి
బియ్యం -1 కిలో
బెల్లం -అరకిలో
నువ్వులు -50 గ్రాములు
నూనె -తగినంత
తయారు చేసేవిధానం
ఒక రోజు ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని పిండి పట్టించి జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం సరిపడా నీళ్ళు పోసుకుని తీగ పాకం పట్టుకోవాలి.
అందులో ఈ పిండిని, నువ్వులు వేసి బాగా కలిపి దించేయాలి. తరువాత కడాయి పెట్టుకుని
నూనె పోసి బాగా కాగనివ్వాలి. దీన్లో కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా
చేసుకుని అరిటాకుపై ఒత్తుకుని నూనెలో వేసి రెండు వైపులా కాలి ఎరుపు రంగు వచ్చాక తీసేయాలి.
అంతే నువ్వుల అరిసెలు రెడీ.
అంతే నువ్వుల అరిసెలు రెడీ.