తిరుప్పావై - 28
కఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్
అమ్మ గోదాదేవి అనుగ్రహించిన శ్రీవ్రత పాశురములలో 28వ పాశురాన్ని ఈరోజు చెప్పుకుంటున్నాం. ఈ దివ్యమైన పాశురములలో గోపికా తత్త్వంతో పూర్తి తన్మయం చెందిపోయి అమ్మ కృష్ణ పరమాత్మని ప్రార్ధిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కీర్తన ఇది. ఇందులో గోపికా తత్త్వం చెప్పబడుతున్నది. ముఖ్యంగా భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు ఉండవలసినది నిష్కపటత్వము, నిరహంకారము. ఈ రెండూ చాలా ప్రధానం. ఆ రెండిటితో మనయొక్క తెలియనితనాన్ని తెలుసుకుంటే చాలు. అన్నీ తెలుసు అని సాధన చేస్తే ఏమీ లాభం లేదు. మాకేమీ తెలియదు స్వామీ నీ కృపయే దిక్కు అనేటటువంటి శరణాగతి కావాలి. పరతంత్రత - పరమాత్మయందు మనం ఆశ్రయించాలి. పరాధీనులం కావాలి. పరమాత్మకి పరాధీనులం కావాలి. ఆయనకు మనం స్వాధీనం అయిపోవాలి. ఆ తత్త్వం ఇందులో కనపడుతున్నది.
స్వామీ! మేము కేవలం ఏమీ తెలియనటువంటి అజ్ఞానులం. ఏదో పొట్ట పోసుకోవడానికి ఆవులవెంటే వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళం. కఱవైగళ్ పిన్ శెన్ఱు - అంటే పశువుల వెంట వెళుతూ
కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్ - అడవులకు చేరుకొని అక్కడ; శేర్-నుంద్-ణ్బోమ్ - అలా చేరుతూ పొట్ట పోషించుకుంటున్నటువంటి వాళ్ళం. పైగా అఱివొన్ఱు మిల్లాద - ఏమీ లోకజ్ఞానం లేనటువంటి వాళ్ళమయ్యా! అయితే మాకున్న పుణ్యమంతా ఒక్కటే. ఏమీ తెలియని అజ్ఞానమైనటువంటి మా గోపవంశంలో నువ్వు పుట్టావు. ఆ పుణ్యం మాకుంది. అమాయకులమైన మమ్మల్ని ఉద్ధరించడం కోసం మాతో సమానముగా ఉన్నట్లుగా గోకులంలో ఉద్భవించావు నువ్వు. నీతో మాకున్నటువంటి సంబంధం పోగొట్టుకోవాలన్నా పోగొట్టేది కాదు. ఇది ఇంక వీడని సంబంధం. కృష్ణుడెవడు అంటే మావాడు. ఈ మావాడు అనేటటువంటి సంబంధం ఉన్నదే ఇది తెగనిది. అలాగే మేము నీవారము. మేము భగవంతుని వారం. భగవంతుడు మనవాడు. ఈభావం చాలా గొప్పది. గోపికల ప్రేమ నిష్కపటమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. పరమాత్మ తప్ప ఏమీ కోరని ప్రేమ. మేము అర్హులము కనుక అనుగ్రహించు అనని ప్రేమ. అలాంటి నిష్కపటమైన ప్రేమ గనుకనే స్వామీ వివేకానంద గోపికాభక్తిని కీర్తిస్తూ ఎంతో ఘనంగా పాశ్చాత్యుల చెవులలో మారుమ్రోగేలాగా పాంచజన్య శంఖారావం చేశాడు. గోపికలు పవిత్రమైనటువంటి వ్యక్తులు. గోపికా కృష్ణ ప్రేమ అత్యంత పవిత్రమైనది. అది అర్థం కావాలంటే first make yourselves pure అని చెప్పాడు ఆ మహానుభావుడు. అందుకే పవిత్రమైన హృదయాలకు మాత్రమే అర్థం అవుతుంది ఆ గోపీతత్త్వం. ఆయన మొత్తం హిందూ ధర్మానికి, భారతీయ ధర్మానికీ, దేశభక్తికీ, దైవభక్తికీ సాకారమై ఉద్భవించినటువంటి మహాపురుషుడు. ఆయన అవతరించిన రోజు ఇది. పైగా ఇది నూట యాభైవ జన్మదినం. ఈ సంవత్సరమంతా కూడా వివేకానంద జయంతి సంవత్సరంగా ప్రకటించుకుంటున్నాం. భారతీయులందరూ కూడా ఆచార్యుని తలంచుకోవాలి. లేకపోతే కృతఘ్నతా దోషం వస్తుంది. ప్రతివాడూ కూడా వివేకానంద సాహిత్యాన్ని చదవాలి కంకణం కట్టుకొని ఈరోజు నుంచి ఆ దీక్షతో వివేకానంద సాహిత్యాన్ని చదువుకొని దానిలో ఉన్న తత్త్వాన్ని ఆకళింపు చేసుకుంటేనే భారతదేశం పూర్వ వైభవాన్ని పొందగలదు. ప్రపంచానికి మార్గదర్శకం కాగలదు. అటువంటి వివేకానందుని స్మరిస్తూ ఈవిషయంలోకి మళ్ళీ ప్రవేశిద్దాం. గోవుల వెంబడి తిరిగి వెళుతున్నటువంటి అమాయకులం స్వామీ! పైగా మా పుణ్యం చేత నువ్వు ఇక్కడ అవతరించావు. అతీతమైన వాడిని మేము చిన్న చిన్న నామాలతో, చిన్న చిన్న వాక్యాలతో కీర్తిస్తున్నామే! ఇది పొరపాటే. దీనిని క్షమించవయ్యా! అందని వాడిని అందుకోవడానికి మేము చెప్పే వాక్యాలు సరిపోతాయా? పరమాత్మ వాక్కులకు అందడు. చిన్న చిన్న పేర్లని పిలిచినందుకు కోపించకు, కృప చూపడం మానకయ్యా! మాకు ఆ పరమును ప్రసాదించు అని అడుగుతున్నారు. ఇక్కడ అన్నమాచార్య తన చివరి కీర్తనగా చెప్పబడుతున్నటువంటి దానిలో చెప్పినటువంటి భావం గుర్తుకు వస్తున్నది. "నా నాలుకపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే పొగడించితివి వేనామాల వెన్నుడా వినుతించ నెంత వాడా, కానిమ్మని నాకీ పుణ్యము కట్టితివింతేనయ్యా, దాచుకో నీపాదాలకు తగనే చేసిన పూజలివే" అని చెప్పినట్లుగా స్వామీ ఈ చిన్న చిన్న పేర్లని ఇలా పిలిచినందుకు మమ్మల్ని మన్నించు. ఏమీ తెలియనటువంటి, లోక మర్యాదలు తెలియనటువంటి పిల్లలం మేము. పేరు పెట్టి నిన్ను పిలుస్తూన్నాం. కోపం తెచ్చుకోకయ్యా! అనుగ్రహించవయ్యా! "ఆలమందల వెన్క అడవులకేగి పరచుచూ కాచుచూ బ్రతికెదము మేము, ఏ తెలివియును లేని జాతి మాదయ్యా, వెంగలి విత్తులో వెర్రి గొల్లలము, అట్టి మాకులమున అవతరించితివి, ఆ పుణ్యమే చాలు అదే పదివేలు, కొదవయింతయు లేని గోవింద దేవా!" - గొప్ప మాట అన్నారు కొదవ లేని గోవిందుడా! ఈమాట చాలా విశేషం. ఏ లోపమూ లేని గోవిందుడా! ఏలోపమూ లేని అంటే పరిపూర్ణుడా! అని అర్థం. కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్రలు లోపమనేది లేదు. కొందరికి కనపడింది అంటే వాళ్ళది శిశుపాల దృష్టి. వాళ్లకి లోపాలు కనపడతాయి అజ్ఞానం చేత. వాడి పేరు శిశిపాలుడు - శిశువు అంటేనే ఎదగని వాడు అని అర్థం. ఎదగనితనం అంటే అజ్ఞానం. అజ్ఞానానికి ప్రభువు వాడు. అందుకే శిశుపాలుడు అంటే. "నీతోడ మాకునూ, మాతోడ నీకు స్నేహ సంబంధంబు చెండాడ రాదు. వలదన్న నోటాడు బంధమ్ము కాదు" - నీతో మాకు ఉన్న బంధం వద్దంటే తెగేది కాదు. ఇది చాలా చక్కని మాట.
భగవంతునికీ మనకీ ఉన్న అనుబంధం ఉన్నదే అది తెగేది కాదు. అదే శాశ్వతం, అదే నిత్యం. మిగిలిన బంధాలన్నీ కూడా భ్రాంతులు మాత్రమే. ఇది నాది అని లోకంలో దేనితో పెట్టుకున్నా అది భ్రాంతే. పరమాత్మతో అనుబంధమే సత్యం. దానిని గుర్తించడమే భక్తి. గుర్తించి బ్రతకడమే గొప్ప జీవితం. ఆ గొప్ప జీవితమే గొప్ప సాధన. అదే తల్లి ఇందులో చూపిస్తూ ఉన్నది. భగవంతునితో ఉన్నటువంటి శాశ్వత సంబంధాన్ని గుర్తించాలి. అందుకే "మా అమృతాత్" అని చెప్తున్నది వేదమంత్రం. అమృత బంధం తెగరాదు. అమృతబంధం అంటే భగవంతుడితో ఉన్న బంధం అమృతబంధం. లోకంతో ఉన్న బంధం మృతబంధం. కనుక ఈ మృత బంధం తెగాలి. అమృత బంధం తెగరాదు. తెగదు. కొలతకందని స్వామిని చేతనైనట్లు ఆరాధించడమే కోలుచుకోవడం. ఇది చక్కటి మాట. అయితే మనం ఎంత కొలిచామో అంతే అనుకోరాదు. మనం ఎంత చేయగలిగామో అంత చేశామే తప్ప ఎంత చేయాలో అంత చేయలేదు. పరమాత్మ యొక్క వైభవాన్ని తత్త్వాన్ని తెలిసి పలుకగలమా! ఏదో తెలిసినంత పలుకుతూన్నాం. ఆ భావం భక్తిలో చాలా ప్రధానం. అంతేగానీ నేను కీర్తించాను, నేను చేశాను అని అహం పనికిరాదు. అటువంటి నిష్కపటమైన నిరహంకారమైనటువంటి సాధనని తల్లి ఇందులో బోధిస్తూ ఉన్నది. "వ్రతము ఫలింపంగ వాద్యమీవయ్యా, మా విన్నపములా మన్నింపుమయ్యా, మననోము జగతికి మంగళప్రదము."
ఆండాళ్ తిరువడిగలై శరణం!!