ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A TRIBUTE TO RUKMINI DEVI ARUNDALE BY SRI PVR MURTHY GARU


Pencil drawing to pay tribute to Rukmini Devi Arundale on her birth anniversary today. (29 February 1904 – 24 February 1986. She was an Indian theosophist, dancer and choreographer of the Indian classical dance form of Bharatnatyam, and an activist for animal rights and welfare.

Rukmini Devi features in India Today's list of '100 People Who Shaped India'. She was awarded the Padma Bhushan in 1956, and Sangeet Natak Akademi Fellowship in 1967.

లీపు సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రముఖ భరతనాట్యకారిణి రుక్మిణీ దేవీ అరుండల్ కు ప్రతిష్టాత్మక సెర్చ్ ఇంజిన్ గూగూల్ ఘన నివాళి అర్పించింది. ఆమె ఫొటోని డూడుల్ చిత్రంగా పెట్టి మరోసారి భారతీయుల మనసు కొల్లగొట్టింది. రుక్మిణి తమిళనాడులోని మధురై నగరంలో 1904, ఫిబ్రవరి 29న జన్మించారు.

సోమవారం ఆమె 112వ జయంతి సందర్భంగా గూగూల్ ఈ నివాళి అర్పించింది. సంప్రదాయ దుస్తుల్లో, నాట్యముద్రతో మెరిసిపోతున్న చిత్రాన్ని పెట్టింది. దీంతో పాటు పింక్ రంగు గల ట్రేడ్‌మార్క్ అక్షరాలను జతచేసింది. 1920ల్లో భరతనాట్యంపై సమాజంలో చిన్న చూపుండేది. వీటన్నింటిని అధిగమించి తనకంటూ రుక్మిణీ దేవీ నాట్య రంగంలో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది. తన భర్తతో కలిసి చెన్నై సమీపంలో కళాక్షేత్ర దగ్గర డాన్స్ అకాడమీని స్థాపించారు.

నాట్యరంగంలో ఈమె కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం 1956లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సంగీత్ నాటక్ అకాడమీ 1967లోఫెల్లోషిప్‌ను ప్రదానం చేశారు. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. మోరార్జీదేశాయ్1977లో ఆమెను ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేయగా రుక్మీణీదేవీ సున్నితంగా తిరస్కరించారు. రుక్మిణి 1986 ఫిబ్రవరి 24న మరణించారు.