ద్రాక్ష... ఆరోగ్యానికి రక్ష!
మధురమైన రుచితో కూడిన ద్రాక్షలో ఎన్నో ఔషధగుణాలూ దాగిఉన్నాయి. అందుకే వీటిని ఆహార నిపుణులు సూపర్‌ఫుడ్‌గా అభివర్ణిస్తున్నారు. వీటిల్లోని పాలీఫినాల్స్ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ క్యాన్సర్లను నివారిస్తాయి. అంతేకాదు, ఈ పాలీఫినాల్స్ బీపీ తగ్గేందుకూ తోడ్పడతాయట. అయితే ఎర్రద్రాక్ష తొక్కలో ఉండే రెస్‌వెరాట్రల్ అనే పాలీఫినాల్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే క్యుయెర్సెటిన్ అనే ఫ్లేవొనాయిడ్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెవ్యాధుల్ని నివారిస్తుందట. అధికంగా ఉండే పొటాషియం, పీచూ కూడా గుండెపనితీరుకి దోహదపడతాయి. ఇంకా క్యుయెర్సిటిన్‌వల్ల కొన్ని రకాల అలర్జీలు కూడా తగ్గుముఖం పడతాయని తేలింది. వారానికి మూడుసార్లయినా ద్రాక్షపండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల మధుమేహ వ్యాధికి కూడా దూరంగా ఉండొచ్చు అంటున్నారు. పైగా వృద్ధాప్యంలో చక్కెర వ్యాధితో వచ్చే రెటీనా సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాదు, ఆల్జీమర్స్ వ్యాధినీ మెనోపాజ్ సమయంలో తలెత్తే భావోద్వేగ హెచ్చుతగ్గులనూ ఇవి నియంత్రిస్తాయి.