ఐరన్ ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
కాస్త నీరసంగా అనిపించినా అనీమియా అని తేలినా వెంటనే మెడికల్ షాపుకెళ్లి ఐరన్ ట్యాబ్లెట్లు కొనుక్కొచ్చి వేసుకోవడం మొదలుపెడతాం. కానీ అవి ఎక్కువగా వాడటం మంచిది కాదు అంటున్నారు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు. ఎందుకంటే రక్తంలో ఐరన్ నిల్వలు పేరుకోవడంవల్ల డీఎన్‌ఏ దెబ్బతింటుందట. ఐరన్ మన శరీరానికి చాలా అవసరం. ఆక్సిజన్ సరఫరాలో అది మరీ కీలకం. కానీ సప్లిమెంట్ల రూపంలో ఐరన్ తీసుకున్నప్పుడు అది రక్తంలో చేరిన పది నిమిషాల్లోనే కణాల్లోని డీఎన్‌ఏను మార్పునకు గురిచేస్తుంది. ఫలితంగా కణాలు దెబ్బతింటున్నాయని తేలింది. ‘అధిక మోతాదులో ఐరన్‌ను తీసుకున్నప్పుడు కణాలు దెబ్బతింటాయని తెలుసు. కానీ కొద్దిగా తీసుకున్నప్పుడు కూడా అది కణాలను దెబ్బతీస్తోంది. అయితే ప్రయోగనాళికల్లో వచ్చిన ఈ ఫలితమే వ్యక్తుల రక్తనాళాల్లోనూ కచ్చితంగా కనిపిస్తుందని నిర్ధరించలేం. కాబట్టి ఇప్పుడే సప్లిమెంట్లను వాడటం ఆపేయాలని చెప్పలేం. కానీ అతిగా వాడటం మంచిది కాదు’ అని సంబంధిత నిపుణులు వివరిస్తున్నారు.