ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PUJA RESULTS OF LORD PANCHAMUKHA ANJANEYA SWAMY


పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు !

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.

మీ ఇంట్లో ఏ దిక్కున హనుమంతుడి బొమ్మను ఉంచాలంటే..?

► తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.

► దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.

► పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.

► ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.

► ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు !
హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్తసులభుడు, హనుమంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేదపండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు.

ఆంజనేయస్వామి నవావతరాలు ప్రసన్నాంజనేయస్వామి, వీరాంజనేయస్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టాదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చల ఆంజనేయస్వామి, చతుర్భుజ ఆంజనేయస్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి మరియు వానరాకార ఆంజనేయస్వామి.
ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు. పంచముఖాలు ఐదు దిక్కులను దృష్టిని సారించి ఉండగా ఆ ముఖాలలోని వివరాలు ఈ విధంగా చెప్పబడ్డాయి.