ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HAIR CARE WITH VUSIRI KAYA - OSIRIKAYA BEAUTY AND HEALTH CARE TIPS


కేశసంరక్షణకు ఉసిరి ఎంతో మేలు. 

రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతోబాటు నల్లగా ఉంటాయి. దీంతో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి ఎంతో మంచివి. ఇవి బాలమెరుపునీ చుండ్రునీ తగ్గిస్తాయి. 

* ఉసిరి రోజూ తింటే కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఫలితంగా ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇందులోని విటమిన్‌-సి శరీరాన్ని ఎండవేడిమి నుంచీ చర్మరోగాల నుంచీ కాపాడటంతోబాటు చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది.

కేవలం ఆయుర్వేదనిపుణులే కాదు, అల్లోపతీ వైద్యులూ ఉసిరిని ఔషధగని అనే పేర్కొంటున్నారు. ఇందులో యాంటీమైక్రోబియల్‌, యాంటీవైరల్‌గుణాలు అధికంగా ఉన్నాయట. రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తుందనీ గ్యాస్ట్రిక్‌ సమస్యల్నీ కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుందని తేలింది. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్‌ స్రావాన్నీ ప్రేరేపిస్తుంది.. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వల్నీ తగ్గించడం ద్వారా హృద్రోగాలూ మధుమేహం... వంటివి రాకుండా అడ్డుకుంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఇందులో ఉన్నాయట. మొత్తమ్మీద ఉసిరిలో రోగనిరోధకశక్తి ఎక్కువన్నది స్పష్టమైంది. అందుకే మనదేశంలో పండే ఈ ఉసిరిని పొడి, క్యాండీలు, రసం రూపంలో నిల్వచేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. చూశారుగా మరి, తాజాగా, ఎండుపండుగా లేదా పొడిరూపంలో ఎలా తీసుకున్నా ఉసిరి... ఆరోగ్యసిరి..!